Featured

వారికి క్షమాపణలు చెప్పిన జక్కన్న.. కారణం ఎంటంటే..?

ఇప్పుడు టాలీవుడ్ లో అందరి చూపు ఆర్ఆర్ఆర్ మూవీపైనే ఉంది. ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా.. సెన్సెషనల్ మల్టీస్టార్ సినిమాను ఎప్పుడు చూద్దామా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను జనవరి 7 న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇక దీనిని రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

పీరియాడిక్ మల్టీ-స్టారర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి కూడా విధితమే. ఇక దీనికి ప్రమోషన్ పనులను వేగవంతం చేసేశారు . తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతో సహ అనేక బాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతుండగా.. అన్నీ భాషల్లో ప్రమోషన్ పనులను చేపట్టారు. దీనికి రాజమౌళినే దగ్గర ఉండి.. ఈ ప్రమోషన్స్ చేయిస్తున్నాడు. దీని నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. దోస్తీ, నాటు నాటు మరియు జనని.

ఈ మూడు పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇటీవల రాజమౌళి కర్ణాటకలో యశవంతపురంలోని ఓరియన్ మాల్ లో సినిమా ప్రమోషన్ లో భాగంగా జనని కన్నడ పాటను ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశారు. అక్కడ అతడు కన్నడలోనే మాట్లాడారు. తర్వాత ఇదే పాటను తమిళంలో లాంచ్ చేస్తున్న సమయంలో సినీ సోదరులకు సారీ చెప్పారు రాజమౌళి.

గత మూడు సంవత్సరాల నుంచి తమతో ఇంటరాక్ట్ కానందుకు తమిళ సినీ మీడియా సోదరులకు మొదట క్షమాపణలు చెప్పారు. జనవరిలో సినిమా విడుదలకు ముందు జరిగే గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో తప్పకుండా తమిళ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తానని, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడతానని రాజమౌళి తమిళ మీడియాకి తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

7 minutes ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

22 minutes ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

31 minutes ago

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

49 minutes ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

59 minutes ago

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్.. భారీ బడ్జెట్‌తో రంగంలోకి హోంబలే!

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…

1 hour ago