ఇప్పుడు టాలీవుడ్ లో అందరి చూపు ఆర్ఆర్ఆర్ మూవీపైనే ఉంది. ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా.. సెన్సెషనల్ మల్టీస్టార్ సినిమాను ఎప్పుడు చూద్దామా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను జనవరి 7 న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇక దీనిని రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
పీరియాడిక్ మల్టీ-స్టారర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి కూడా విధితమే. ఇక దీనికి ప్రమోషన్ పనులను వేగవంతం చేసేశారు . తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతో సహ అనేక బాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతుండగా.. అన్నీ భాషల్లో ప్రమోషన్ పనులను చేపట్టారు. దీనికి రాజమౌళినే దగ్గర ఉండి.. ఈ ప్రమోషన్స్ చేయిస్తున్నాడు. దీని నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. దోస్తీ, నాటు నాటు మరియు జనని.
ఈ మూడు పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇటీవల రాజమౌళి కర్ణాటకలో యశవంతపురంలోని ఓరియన్ మాల్ లో సినిమా ప్రమోషన్ లో భాగంగా జనని కన్నడ పాటను ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశారు. అక్కడ అతడు కన్నడలోనే మాట్లాడారు. తర్వాత ఇదే పాటను తమిళంలో లాంచ్ చేస్తున్న సమయంలో సినీ సోదరులకు సారీ చెప్పారు రాజమౌళి.
గత మూడు సంవత్సరాల నుంచి తమతో ఇంటరాక్ట్ కానందుకు తమిళ సినీ మీడియా సోదరులకు మొదట క్షమాపణలు చెప్పారు. జనవరిలో సినిమా విడుదలకు ముందు జరిగే గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో తప్పకుండా తమిళ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తానని, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడతానని రాజమౌళి తమిళ మీడియాకి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…