కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటుడే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలలో భాగస్వాముడు కూడా. ఆయన ఆధ్వర్యంలో 26 అనాథాశ్రమాలు, 25 పాఠశాలలు, 15 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నడుస్తున్నాయి. 1800 మంది పేద విద్యార్ధులకు ఆయన చదువు చెప్పిస్తున్నారు. మైసూరులో బాలికా విద్యార్ధినులతో కూడిన శక్తి ధామ అనే ఓ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థను కూడా ఆయన నడుపుతున్నారు. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయినా ఆ సేవలను ప్రచారం చేసుకోవడానికి అతడు ఏ మాత్రం ఇష్టపడలేదు. ఇంత గొప్ప వ్యక్తి మరణం ఎవరినీ జీర్ణించుకోలేక చేసింది.
ఇక పునీత్ నటించిన చివరి సినిమా జేమ్స్. ఈరోజు అయన పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో సుమారు 5 భాషల్లో “జేమ్స్” చిత్రాన్ని విడుదల చేసారు. పునీత్ చనిపోకముందు చివరగా నటించిన సినిమా కావడంతో అభిమానులంతా భావోద్వేగానికి గురవుతున్నారు. చివరిసారిగా స్కీన్ పై పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను చూసి బరువెక్కిన హృదయంతో కన్నీరు మున్నేరు అవుతున్నారు. ఈ నేపద్యంలో ఇప్పటికే మార్చి 17 నుంచి 24 వరకు ఈ వారం రోజులు కర్ణాటకలోని అన్ని సినిమా ధియేటర్స్ లో “జేమ్స్” సినిమానే ప్రదర్శిస్తామని డిస్టిబ్యూటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఎక్కడ చూసిన పునీత్ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా మొత్తం పునీత్ రాజ్ కుమార్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ఈరోజు పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు కూడా కావడంతో అయన అభిమానులు మరింత ఎమోషనల్ అవుతూ ఆయనను చివరిగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…