Featured

Janardhan rao : యమలీల సినిమా హీరో ఎవరు అనే విషయం కూడా ఆలీకి తెలియదు… చిరంజీవి ని అలా అనేసరికి డైరెక్టర్ పరిగెత్తుకుని వచ్చాడు : జనార్దన్ రావు

Janardhan Rao : తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన పోలాప్రగఢ జనార్దన్ రావు గారు తన సినిమా విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జెన్నీ గా బాగా ప్రచుర్యం పొందిన ఈయన సినిమాలే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించారు. ECILలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు లో కూడా పని  చేసారు. ఒక 3 నెలల పాటు యాక్టింగ్ కోర్స్ చేసిన ఈయన ఆ అనుభవంతో ఎన్నో చిత్రాలలో, సీరియల్స్ లో మరియు ఎన్నో వేల స్వదేశీ, విదేశీ సినిమా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

యమలీల సినిమా జీవితాన్ని మార్చింది…

జెన్నీ గారి జీవితంలో ఆయన సినిమా కేరర్ ను మలుపు తిప్పింది ‘యమలీల’ సినిమా. యమలీల సినిమాలో పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా మొదట ఒక రోజు షూటింగ్, చిన్న పాత్ర అని ఇచ్చారు. ఆ తరువాత వారం రోజులకు పెంచి షూటింగ్ చేశారు. ఇక ఆసినిమా 200 రోజులు ఆడి సూపర్ హిట్ అయింది. సినిమా కోసం సంతకం చేసే సమయంలో ఆలీ కి కూడా ఆ సినిమాలో తాను హీరో అనే విషయం తెలియదు, సంతకం పెడుతూ ఎవరు హీరో అని అడిగాడట అంటూ జనార్ధన్ గారు చెప్పారు. ఇక ఆ సినిమా వల్ల దాదాపు 30 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే ఉద్యోగం విషయంలో చాలా బయపడ్డాను. ఈ సినిమా ఆఫర్లు ఎన్నిరోజులు ఉంటాయో తెలియదు, అలా అని ఉద్యోగం వదిలేయలేను. ఆ సమయంలో కృష్ణా రెడ్డి, తనికెళ్ళ భరణి నీ కుటుంబ పరిస్థితులు నీ వ్యక్తిగత లక్ష్యాలను అలోచించి ఉద్యోగం గురించి నిర్ణయం తీసుకోండి తొందరపడవద్దు అని చెప్పారట.

ఇక చిరంజీవి గారి సినిమా ‘మెకానిక్ అల్లుడులో’ డాక్టర్ గా నటించినపుడు ఒక సన్నివేశంలో చిరంజీవి తల్లి హాస్పిటల్ లో చేరి అన్న నాగేశ్వరావు ను కలవరిస్తుంటుంది, ఆ సమయంలో నేను చిరంజీవి వద్దకు వెళ్లి మీ అమ్మ గారు వాళ్ళ అన్నను కలవరిస్తోంది వెళ్లి అయనను తీసుకురండి అని చెప్పాలి. అయితే నేను ఆయన భుజం తట్టి చెప్పొచ్చ అనే విషయాన్ని చిరంజీవి గారినే అడిగేసాను ఆయన సానుకూలంగా మాట్లాడారు. అయితే నేను చిరంజీవి తో ఏం మాట్లాడుతున్నానో అని బి గోపాల్ గారు బయపడి పరిగెత్తుకొచ్చారు అంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago