Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా ధడక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి జాన్వీ కపూర్. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ సౌత్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.అయితే ఈ సినిమా కోసం తాను ఎంతగా ఎదురు చూశాననే విషయాన్ని ఓ సందర్భంలో ఈమె తెలియజేశారు. తాజాగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి అభిమానులతో ఈమె చిట్ చాట్ చేశారు. దీంతో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఓ అభిమాని దేవర సినిమా గురించి ఈమెను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా జాన్వీకపూర్ దేవర సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్ గా నన్ను తీసుకుంటే చాలా బాగుంటుంది అంటూ దాదాపు ఏడాది పాటు దేవుడిని అదే కోరుకున్నానని తెలియజేశారు. అయితే నా కోరిక నెరవేరిందని ప్రస్తుతం తాను ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నానని తెలిపారు.
ఎన్టీఆర్ పక్కన జాన్వి కపూర్ నటించాలని చాలా బలంగా కోరుకున్నారని ఈ సందర్భంగా ఈమె వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుంది.కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా శరగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సెలవులకు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…