Featured

Jayamalini : అక్క జ్యోతిలక్ష్మితో గొడవలకు కారణం ఇదే… జ్యోతిలక్ష్మి ఆస్తులు ఎలా పోయాయాంటే… చనిపోయే ముందు అక్క మా ఇంటికి వచ్చి…: జయమాలిని

Jayamalini : డెబ్భైయ్యో దశకములో ఐటమ్ సాంగ్ అనగానే గుర్తొచ్చేది జ్యోతి లక్ష్మి, జయమాలిని. అప్పట్లో వీరిద్దరూ ట్రెండ్ సెట్ చేసారు. ఎంతటి అగ్ర హీరో అయినా వీరి ఐటమ్ సాంగ్ ఒకటి ఉండాల్సిందే అన్నట్లుగా డిమాండ్ ఉండేది వీరికి. నిజానికి జయమాలిని వచ్చాక జ్యోతిలక్ష్మి కి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. మొదటి నుండి సినిమా నేపథ్యం ఉండటం వల్ల జ్యోతిలక్ష్మి గారు డాన్స్ నేర్చుకుంటున్న గురువు దగ్గరే జయమాలిని డాన్స్ నేర్చుకున్నారు. అలా ఒకసారి వారి ఇంటికి వచ్చిన విఠలాచార్యా గారు జయమాలనిని చూసి ఆయన తెలుగు సినిమా ‘ఆడదాని అదృష్టం’ లో అవకాశం ఇచ్చారు. ఇక జయమాలిని ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమాలో హీరోయిన్ గా చేసారు. ఇక ‘జగన్మోహని’ సినిమాలో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన జయమాలిని గారు ఆ తరువాత స్పెషల్ సాంగ్స్ లో ఒక ఊపు ఉపేశారు.

అక్క ఆస్తులు పోవడానికి కారణం…

జ్యోతిలక్ష్మి పీక్స్ లో ఉన్న సమయంలో ఇండస్ట్రీకి వచ్చిన జయమాలిని ఒకరకంగా ఆమెకు గట్టి కంపిటిషన్ ఇచ్చారు. అప్పట్లో జ్యోతిలక్ష్మి, జయమాలినితో దూరంగా ఉండేవారు. మళ్ళీ చాలా రోజులకు జయమాలిని తో చనిపోయే ముంది చివరి రోజుల్లో మాట్లాడారట జ్యోతిలక్ష్మి. అక్క అంటే చాలా భయం అంటూ చెప్పే జయమాలిని, జ్యోతిలక్ష్మి చివరి రోజుల గురించి మాట్లాడారు. జ్యోతిలక్ష్మి గారు బ్లడ్ క్యాన్సర్ తో మరణించారు. జయమాలిని చిన్నదైనా జ్యోతిలక్ష్మి గారు తన కూతురు విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే జయమాలిని ని అడిగేవారట.

ఎవరూ శాశ్వతంగా శత్రువులు కాదు, మిత్రువులు కాదు అంటూ తెలిపారు. ఇక జ్యోతి లక్ష్మి గారు సంపాదించినదంతా పోడానికి కారణం గురించి మాట్లాడుతూ జ్యోతిలక్ష్మి ని చిన్నపటి నుండి మేనత్త పిల్లలు లేకపోవడంతో పెంచారట. అలా అమ్మకు మాకు దూరంగా పెరగడం వల్ల మా మీద చెడు అభిప్రాయాన్ని అక్కపై మేనత్త రుద్దిందంటూ ఆ ప్రభావం వల్లే మాతో మాట్లాడేది కాదు అంటూ జయమాలిని చెప్పారు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతిలక్ష్మి ఖర్చు పెట్టడం ఎక్కువ అంటూ తెలిపారు. ఆస్తి చేయాలని డబ్బు దాచుకోవాలని ఎపుడూ అనుకోలేదు అందుకే ఉన్న డబ్బు అంతా ఖర్చు చేసుకుంది. ఇక తనను పెంచిన మేనత్త కూడా తనకు ఏమాత్రం డబ్బు మిగల్చలేదు. చివర్లో అమ్మ అందరూ తనకు ఏదైనా ఆస్తి ఇవ్వు అంటే అప్పడు కొంత భూమి ఇచ్చింది అంటూ జ్యోతిలక్ష్మి గారికి ఆస్తులు లేకపోడానికి కారణం వివరించారు జయమాలిని. ఇక కాన్సర్ తో బాధపడుతు చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సమయంలో జ్యోతిలక్ష్మీతో మాట్లాడానంటూ జయమాలిని చెప్పారు. అప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉండేవారంటూ బాగా మాట్లాడేవారంటూ తెలిపారు. చివరి రోజుల్లో ఇంటికి వచ్చేదని నాతోనే ఉండేదంటూ ఎమోషనల్ అయ్యారు జయమాలిని.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

2 days ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

2 days ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

2 days ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

2 days ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago