Featured

Jayamalini : జీవితా రాజశేఖర్ ఇంటికి వెళితే మజ్జిగ ఇచ్చారు… ఎలా ఉందంటే…: జయమాలిని

Jayamalini : డెబ్భైయ్యో దశకములో ఐటమ్ సాంగ్ అనగానే గుర్తొచ్చేది జ్యోతి లక్ష్మి, జయమాలిని. అప్పట్లో వీరిద్దరూ ట్రెండ్ సెట్ చేసారు. ఎంతటి అగ్ర హీరో అయినా వీరి ఐటమ్ సాంగ్ ఒకటి ఉండాల్సిందే అన్నట్లుగా డిమాండ్ ఉండేది వీరికి. నిజానికి జయమాలిని వచ్చాక జ్యోతిలక్ష్మి కి అవకాశాలు తగ్గాయానే చెప్పాలి. మొదటి నుండి సినిమ నేపథ్యం ఉండటం వల్ల జ్యోతి లక్ష్మి గారు డాన్స్ నేర్చుకుంటున్న గురువు దగ్గరే జయమాలిని డాన్స్ నేర్చుకున్నారు. అలా ఒకసారి వారి ఇంటికి వచ్చిన విఠలాచార్యా గారు జయమాలనిని చూసి ఆయన తెలుగు సినిమా ‘ఆడదాని అదృష్టం’లో అవకాశం ఇచ్చారు. ఇక జయమాలిని ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమాలో హీరోయిన్ గా చేసారు. ‘జగన్మోహని’ సినిమాలో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన జయమాలిని గారు ఆ తరువాత స్పెషల్ సాంగ్స్ లో ఒక ఊపు ఉపేశారు.

జీవితా రాజశేఖర్ ఇంటికి వెళితే మజ్జిగ ఇచ్చారు…

జయమాలిని సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పనిచేయడం లేదు, తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నారు. అయినా తన అభిమానులను, తనతో పనిచేసిన ఆర్టిస్టులను మాత్రం మర్చిపోలేదు. అందుకే తాజాగా చెన్నై నుండి హైదరాబాద్ కు తన స్నేహితురాలిని చూడటానికి వచ్చి తాను కలిసి పనిచేసిన వారిని వెళ్లి పలకరించి వచ్చారు. అలా చిరంజీవి, బాలకృష్ణ, జీవిత, గిరిబాబు, రోజా రమణి వంటి వారిని కలిశారట. అదేపనిగా అందరినీ కలవాలని ఒక రోజు ఎక్కువ హైదరాబాద్ లో ఉండి మరీ అందరినీ కలిసారటా జయమాలిని.

అలా చిరు, బాలయ్య ను కలిసాక జీవితా రాజశేఖర్ ఇంటికి వెళితే ఆమె చాలా బాగా రిసీవ్ చేసుకున్నారంటూ తెలిపారు. వెళ్ళగానే మజ్జిగ ఇచ్చి చాలా బాగా మాట్లాడారు. చాలా బాగున్నాయి మజ్జిగ, తనతో కాసేపు మాట్లాడి ఆ తరువాత గిరిబాబు గారి ఇంటికి వెళ్ళాను అంటూ తెలిపారు. గిరిబాబు గారు వృధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన చాలా వరకు విషయాలు మర్చిపోయారు. వెళ్లి నేను జయమాలిని అని చెబితే కాసేపటికి గుర్తు పట్టి మాట్లాడారు అంటూ జయమాలిని అందరి గురించి చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago