Featured

Ram Gopal Varma : సత్య సినిమా తీయాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే…: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma : తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్ ను తెచ్చిన ట్రెండ్ సెట్టర్ వర్మ. ‘శివ’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా తీరును మార్చేశాడు. స్టడీ కెమెరాను వాడి సినిమా విజువల్స్ కి కొత్తదనం తీసుకొచ్చి అలానే సినిమా పంథాను మార్చి అందరినీ ఆకర్శించాడు వర్మ. వివాదాలతో బతికే వర్మలో ఒక మంచి టెక్నీషియన్ ఉన్నాడు ఇది ఎవరూ కాదనలేని నిజం. తాను తీసిన పాత సినిమాలను చూస్తే ఎవరైనా ఆర్జీవి ఫ్యాన్ అవ్వాల్సిందే. అయితే ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు ఉన్న వర్మ వేరు. అయితే తాజాగా తన సినిమాల్లో మాఫియాను తన సినిమాల్లో చూపించే విధానం గురించి విశేషాలను వర్మ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సత్య సినిమా ఎందుకు తీసానంటే…

రామ్ గోపాల్ వర్మ అనగానే శివ, రంగీలా, సత్య లాంటి మాస్టర్ పీస్ సినిమాలు గుర్తొస్తాయి. అందులోనూ సత్య సినిమా గ్యాంగస్టర్స్, అండర్ వరల్డ్ ను ఇండియాకు కొత్తగా చూపించాడు. అలాంటి సత్య సినిమా ఆలోచన అసలు వర్మకు ఎలా వచ్చింది అన్నది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వర్మ వివరించారు. సత్య సినిమా తీయాలనే ఆలోచనకు మూల కారణం మ్యూజిక్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ గుల్షన్ కుమార్ హత్య. గుల్షన్ కుమార్ 1997 లో గుడి బయట కాల్చి చంపబడ్డాడు. అదే రోజు రామ్ గోపాల్ వర్మ రంగీలా సినిమా నిర్మాత ఇంట్లో ఉండగా అతనికి గుల్షన్ కుమార్ మరణం ఫోన్ ద్వారా తెలిసింది.

పక్కన ఉన్న వర్మకు అతను ఉదయం ఏడు గంటల ప్రాంతంలో నాకు ఫోన్ చేసాడు, ఇన్ని గంటలకు గుడికి వెళ్ళాడు అంటూ చెప్పడంతో వర్మకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. చనిపోయిన వ్యక్తి మరణించక ముందు రెండు గంటలు ఏం చేసాడు అన్నది అందరూ ఆలోచిస్తున్నారు మరి చంపిన కిల్లర్ ఏం చేసాడు ఉదయం నుండి ఒక వ్యక్తిని హత్య చెసేవరకు ఎలా ఆలోచిస్తాడు, ఏం చేస్తాడు అన్న పాయింట్ నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అదే పాయింట్ తోనే సత్య కథ రెడీ చేసుకున్నాను అంటూ వర్మ చెప్పారు. ఇక సత్య సినిమాలో అందరూ కొత్తవారిని పెద్దగా ఇండస్ట్రీకి తెలియని వారిని తీసుకోవాలని అప్పుడే సినిమాలోని పాత్రలను మాత్రమే చూస్తారని వర్మ అందరినీ అలానే ఎంపిక చేసుకున్నారట.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago