Featured

Jayaprada : షూటింగ్ కోసం వెళ్లి వరదలో, ట్రైన్ లోనే మూడు రోజులు… ఆకలికి ఏడుపు వచ్చింది..!

Jayaprada : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జయప్రద గురించి తెలియని వాళ్ళు వుండరు. అప్పటిలో చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయినలలో ఒకరుగా వెలిగారు. 1976 లో భూమికోసం సినిమా ద్వారా తెలుగులో 3 నిమిషాల నిడివి వున్నా పాట తో పరిచయం అయ్యింది. మూడు దశాబ్దాల తన సినీ ప్రస్థానం లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి వంటి ఆరు భాషలలో దాదాపు 300 పైగా సినిమాలలో నటించింది. 1996లో తెలుగు దేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక అయినా, కొన్ని కారణాల వలన పార్టీకి రాజీనామా చేసి ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదముతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గము నుండి 2004 మే 13న లోక్ సభకు ఎన్నికైనది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయప్రద ఒక షూటింగ్ సమయంలో వరదలో చిక్కుకున్నప్పటి ఆసక్తికర విషయాలు చెప్పింది.

అంతటి వరదలో కూడా అభిమానూలు…

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయప్రద తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జయప్రద, బాలకృష్ణ హీరోగా చేస్తున్న ఒక సినిమా షూటింగులో పాల్గొనడానికి ట్రైన్ లో వెళ్తున్న సమయంలో వరదలో చిక్కుకున్నామని చెప్పారు. ట్రైన్ యాక్సిడెంట్ అవ్వాల్సిన పరిస్థితి తృటిలో తప్పిందని కానీ వరద కారణంగా ఎటు పోలేని పరిస్థితి. మూడు రోజులు ట్రైన్ లోనే గడపాల్సి వచ్చింది. మూడు రోజులు ఆహారం లేక ఆకలికి ఏడుపు వచ్చిందని చెప్పారు. అంతటి పీకలలోతు వరదలోనూ తనని చూడటానికి అభిమానులు వచ్చారని చెప్పుకొచ్చింది. వాళ్ళ అభిమానం చూసి ఏడ్చేసాను అన్నారు.

తరువాత ఒక ఆఫీసర్ జయ ప్రద గారిని కలిసి ఏంటి పరిస్థితి అని తెలుసుకున్నాడని, ఆకలిగా వుంది అని అడుగగా ఇంటి నుంచి భోజనం తెప్పించారని చెప్పారు. ఆ సంఘటన ఇప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. తరువాత మీటర్ గేజ్ ట్రైన్ ద్వారా వారిని అక్కడినుంచి పంపించారని చెప్పారు. ఆపరిస్థితిలో చాలా బాధపడ్డానని, తనతో పాటు తన సోదరులు కూడా ఇబ్బంది పడ్డారట. ఇలా తన లైఫ్ లో జరిగి వరద సంఘటన గురించి చెప్పుకొచ్చారు.

Bhargavi

Recent Posts

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

18 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

18 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

19 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

19 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

19 hours ago

గ్రీన్ టీనా.. బ్లాక్ టీనా..? బరువు తగ్గాలంటే ఏది మంచిది.. అసలు నిజం ఇదే!

నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…

19 hours ago