Featured

Supreetha : మేము ఎలా ఉంటే మీకెందుకు… మేము ఎలాంటి బట్టలు వేసుకొని తిరిగితే మీకెందుకు… సుప్రీత హాట్ కామెంట్స్…!

Supreetha : తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి అందరికీ సుపరిచితురాలే, చాలా తెలుగు సినిమాల్లో అక్కగా, తల్లిగా, వదినగా నటించి మెప్పించింది. కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటోంది. కూతురితో కలిసి ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంది. భర్త చనిపోయాక సురేఖ, కూతురు సుప్రీతతో కలిసి డాన్స్ వీడియోలు చేస్తూ, పార్టీస్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

మేము ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకెందుకు…

ఇక సుప్రీత ను హీరోయిన్ గా లాంచ్ చేయాలని సురేఖ సోషల్ మీడియా ద్వారా కూతురిని అభిమానులకు దగ్గర చేసింది. ఇక ఇప్పుడు సుప్రీత హీరోయిన్ గా సినిమా వస్తోంది. సోషల్ మీడియాలో సురేఖ, సుప్రీతలకు చాలా నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. ఆ మధ్య తల్లీకూతుళ్ళు బ్యాంకాక్ వెళ్ళి, అక్కడ ఎంజాయ్ చేసారు. ఇక సుప్రీత, సురేఖ కు మందు తాగించే వీడియో బాగా వైరల్ కూడా అయింది. దీంతో వారి మీద మరింత ట్రోల్ల్స్ ఎక్కువయ్యాయి. ఇక ఎప్పటికప్పుడు వారి మీద వచ్చే నెగెటివ్ కామెంట్స్ కి రిప్లై ఇచ్చే సుప్రీత తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మరోసారి ఘాటుగా స్పందించింది. తరచూ వారు వేసుకునే బట్టల గురించి నెగెటివ్ కామెంట్స్ రావడంతో వాటిపై స్పందించింది. మేము ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకెందుకు, మీరు మాకు కొనివ్వడం లేదుకదా అంటూ మాట్లాడింది. ఇక తన తండ్రి చనిపోయినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలుసు, ఎవరు మా ఇబ్బందులను చూడలేదు. నా తల్లి ఇంటికే పరిమితమై బాధపడుతున్న సమయంలో తనకు మార్పు అవసరమని బయటికి తీసుకెళ్లాను. ఇక ఫోటోలను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తే చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. భర్త చనిపోయాడనే బాధ లేదా అంటూ పెట్టారు.

నాన్నకు తలకొరివి నేనే పెట్టాను.. నాన్న బంధువులు ఎవరు రాలేదు…

మేము ఎలాంటి బాధ, ఇబ్బందులు పడుతున్నామో వారికెలా తెలుస్తాయి, తెలియకుండా ఇలా ఇంకొకరి జీవితం గురించి ఎలా కామెంట్స్ చేస్తారు అంటూ మాట్లాడింది. ఇక తన తల్లి మళ్ళీ పెళ్లి చేసుకోబోతోందని కూడా సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి అలాంటివి చూసినప్పుడు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపిస్తుంది అంటూ చెప్పింది సుప్రీత. ఇక తన తండ్రి చనిపోయినప్పుడు తన సొంత సోదరులు కానీ బంధువులు కానీ రాలేదు. అంతా అమ్మ తరపు వాళ్లే చూసుకున్నారు. ఇప్పటికీ వాళ్లే మాకు అండగా ఉన్నారు. పాడే ఎత్తాలన్నా మళ్ళీ నీళ్లు చల్లించుకోవాలి మీరే కానిచ్చేయండి అని అన్నారట వాళ్ళ నాన్న సొంత సోదరుడు. అలా వాళ్ళు పడిన ఇబ్బందులను సుప్రీత ఇంటర్వ్యూలో పంచుకుంది.

Bhargavi

Recent Posts

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

27 minutes ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

20 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

21 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

21 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

21 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

21 hours ago