Jr NTR Phone Number: లీకైన ఎన్టీఆర్ ఫోన్ నెంబర్.. వరుస ఫోన్ కాల్స్ చేస్తున్న అభిమానులు?
Jr NTR Phone Number: సాధారణంగా అభిమాన సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం లీక్ అయినా నెటిజన్ లు పెద్ద ఎత్తున వైరల్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ లీక్ అయితే అభిమానులు ఊరికే ఉంటారా. ఇలా ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ లీక్ కావడంతో అభిమానులు వరస ఫోన్లు చేయడం మొదలుపెట్టారు.
ఎన్టీఆర్ అభిమాని జనార్దన్ అనే వ్యక్తి తీర్థమైన అనారోగ్య పరిస్థితులలో ఉండటంతో ఈ విషయం తెలిసిన తారక్ వెంటనే ఆయనకు ఫోన్ చేసి తనని తన తల్లిని పరామర్శించారు. ఈ క్రమంలోనే ఈ ఫోన్ కాల్ కి సంబంధించిన వీడియోని ఎన్టీఆర్ పిఆర్వోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ అయింది. అయితే ఈ వీడియోలో ఫోన్ నెంబర్ ఉండడంతో అందరూ అది ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ అని భావించారు.
ఇలా ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ లీక్ అవడంతో అభిమానులు వరుసగా ఆ నెంబర్ కి ఫోన్ చేస్తూ శివమణి సినిమాలో సన్నివేశాన్ని తలపించేలా చేశారు. అయితే ఆ నెంబర్ కి ఫోన్ చేయడంతో అది ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ కాదని, ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరు మీద ఉందని తెలుస్తోంది. కానీ ఈ వీడియో చూసిన వాళ్లంతా అది ఎన్టీఆర్ నెంబర్ అని పొరపాటు పడి ఆయనతో మాట్లాడాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్టీఆర్ అభిమాని ఆరోగ్యం బాగా లేకపోవడంతో తనతో మాట్లాడాలని ప్రయత్నం చేయగా, ఫోన్ నెంబర్ లీక్ కావడంతో చాలామంది ఎన్టీఆర్ నెంబర్ అని భావించి వరుస ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అయితే చివరికి అది ఎన్టీఆర్ నెంబర్ కాదని తెలియడంతో ఎంతో మంది నిరుత్సాహ పడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…