Featured

Producer Ashok Kumar : ఈశ్వర్ ఫస్ట్ సినిమా పోస్టర్ చూడగానే ఎన్టీఆర్ మాటలు ఇప్పటికీ మర్చిపోలేను… విలన్, నిర్మాత అశోక్ కుమార్

Producer Ashok Kumar : విలక్షణ నటుడుగా, విలన్ గా, నిర్మాతగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు కె. అశోక్ కుమార్. విక్టరీ వెంకటేష్ నటించిన ‘రక్త తిలకం’ అనే సినిమాతో నిర్మాతగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే హిట్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భారత్ బంద్’ సినిమాతో నటుడుగా పరిచయం అయ్యారు. నిర్మాతగా ‘రక్త తిలకం’, ‘ధృవ నక్షత్రం’, ‘చెవిలో పువ్వు’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ఈశ్వర్’ ‘జయదేవ్’ వంటి హిట్ సినిమాలను అందించారు.

ఇక ఒసేయ్ రాములమ్మ సినిమాల్లో చేసిన విలన్ రోల్ అశోక్ కుమార్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అశోక్ కుమార్ కి స్వయానా దగ్గుబాటి రామానాయుడు గారు మేనమామ అవ్వడం విశేషం. ఆయన స్ఫూర్తి తోనే నిర్మాతగా పరిచయం అయ్యారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అశోక్ తాను నిర్మించిన ఈశ్వర్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఎన్టీఆర్ చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను…

నిర్మాత గా తెలుగులో ఎన్నో హిట్ సినిమాలు నిర్మించిన అశోక్ కుమార్ ఈశ్వర్ సినిమా ద్వారా రెబల్ స్టార్ ప్రభాస్ ని హీరో గా పరిచయం చేశారు. ప్రభాస్ కు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు కూడా లభించింది. అసలు ఈశ్వర్ సినిమాకు ప్రభాస్ ను ఎలా ఎంపిక చేసుకున్నారు, ఆ సినిమా విశేషాల గురించి అశోక్ చెప్పారు. మొదట దర్శకుడు అశోక్ వాళ్ల అబ్బాయిని హీరోగా పెడదాం అనుకున్నా, అశోక్ ఆ సలహాను సున్నితంగా తిరస్కరించి హీరో కోసం వెతికారట. అయితే మరో నిర్మాత కే. సి. శేఖర్ బాబు సలహా మీద కృష్ణం రాజు గారిని సంప్రదించడం ప్రభాస్ ను హీరోగా ఫిక్స్ అవ్వడం జరిగిపోయిందట.

అయితే ఈశ్వర్ సినిమా ఫస్ట్ పోస్టర్ ను ఎన్టీఆర్ కి చూపిస్తే చాలా బాగుంది బాబాయ్(అశోక్) ఇండస్ట్రీ కి ఒక మంచి హీరోని తీస్తున్నారు అని చెప్పారట. ఎటువంటి ఇగో లేకుండా అందరికీ మంచి హిట్లు రావాలి, ఎదగాలి అని ఎన్టీఆర్ కోరుకోవడం ఇప్పటికీ నేను మర్చిపోలేను అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా సినిమా ప్రమోషన్ కోసం కూడా ఎన్టీఆర్ వచ్చారని చెప్పారు.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago