Rama Sathyanarayana : సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం, ఎంతోమంది సినిమాల్లో నటించాలనో, డైరెక్టర్ అవ్వాలనో, సినిమా నిర్మించాలనో సినిమా రంగంలో ఎలాగోలా స్థిరపడాలని అనుకుంటారు. అలా ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చినా సక్సెస్ అయ్యేది మాత్రం కొంతమందే. ఇక అలానే సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా తన పేరు చూసుకోవాలని వచ్చి తాను ఎదుర్కొన్న సంఘటనలను పంచుకున్నారు రామ్ సత్యనారాయణ గారు.
విష్ణు తో సినిమా తీయడానికి ఐదు లక్షలిచ్చి మోసపోయా…
ఇక సినిమా మీద మోజుతో ఆకీవీడు నుండి వ్యాపారంలో సంపాదించిన దాంట్లో ఐదు లక్షలు పట్టుకుని మద్రాస్ వెళ్లి కోడి రామకృష్ణ స్నేహితుడు కావడంతో సినిమా ప్రొడ్యూసింగ్ గురించి అడుగగా రెండేళ్లు వెయిట్ చేయమని చెప్పారు. ఈలోపు ‘రామరాజ్యం వచ్చింది’ సినిమాకు మొత్తం డబ్బు సమర్పకుడిగా పెడితే మొత్తం పోయింది, సినిమా విడుదల అవ్వలేదు. ఇక మళ్ళీ సినిమా జోలికి వెళ్లకుండా వ్యాపారం చేసుకుని మళ్ళీ బాగా సంపాదించాక మళ్ళీ ఊహ సినిమా నిర్మించగా అందులో పెట్టిన పెట్టుబడి వచ్చింది. ఇక మళ్ళీ సినిమా పై నమ్మకం వచ్చి మళ్ళీ సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలని మద్రాస్ వెళ్లగా ఈసారి ఎమ్ ఎస్ నారాయణ గారి సలహా మేరకు సి కళ్యాణ్ ను కలవగా ఆయన కొన్నిరోజులు సినిమా ఎలా తీస్తారో ముందు చూసి నేర్చుకో మళ్ళీ సినిమా ప్రొడ్యూసర్ అవ్వచ్చు అని చెప్పగా, ఆరు నెలలు ఆయన నిర్మిస్తున్న సినిమాలకు గోస్ట్ ప్రొడ్యూసర్ గా పనిచేసారు.
ఇక ఆరు నెలలైనా సినిమా నిర్మాత కాలేదని బెల్లం కొండ సురేష్ ద్వారా మోహన్ బాబును కలిసి విష్ణు తో సినిమా తీయాలని అనుకుని ఐదు లక్షలు అడ్వాన్స్ ఇవ్వగా, సినిమా అయితే పట్టాలెక్కలేదు ఇక ఇచ్చిన డబ్బు వాళ్ళు తిరిగి ఇవ్వలేదు. అలా మరో ఐదు సినిమాలకు అలాగే డబ్బిచ్చి పోగొట్టుకున్నాను. ఇక మళ్ళీ మోసపోయానని అర్థమైంది. ఇక సినిమా వద్దనుకునే సమయానికి మళ్ళీ నా స్నేహితుడు ధైర్యం ఇచ్చి మళ్ళీ కృష్ణ గారితో ఒక సినిమా చేసాము. అలా సాగిన ప్రయాణంలో చివరికి నిర్మాతగా మారి ఐస్ క్రీమ్, అవంతిక, ఏ ఫైర్ లాంటి సినిమాలను నిర్మించారు రామ సత్యనారాయణ గారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…