Jayapradha : చీరకట్టు పెద్ద బొట్టు లో నిండు తెలుగుదనంతో ఉండే హీరోయిన్ అనగానే అప్పటి హీరోయిన్ జయప్రద గుర్తొస్తుంది. రాజమండ్రికి చెందిన జయప్రద 70 లలో సినిమా ఇండస్ట్రీ లో అగ్ర హీరోయిన్ గా ఉంటూ అందరు అగ్రహీరోలతోను సినిమాలను చేసింది. ఇక ఒక్క తెలుగులోనే కాకుండా ఇటు సౌత్ అన్ని భాషలలోనూ నటించిన జయప్రద అలాగే అటు హిందీలోనూ అగహీరోలరతో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఉత్తరాదిన హిందీ మాత్రమే కాకుండా అటు మరాఠి వంటి భాషల్లో కూడా నటించింది జయప్రద. ఇక స్టార్డం పీక్స్ లో ఉన్న సమయంలోనే కష్టాలు కూడా మొదలయ్యాయి.
నమ్మించి మోసం చేసిన నిర్మాత…
జయప్రద హీరోయిన్ గా ఎన్నో ఆస్తులను సంపాదించింది, ఇక దీంతో ఆదాయ పన్ను నుండి ఎన్నో ఇబ్బందులను ఎదురకొంది జయప్రద. అలాంటి తరుణంలో ఆమెకు సహయం చేస్తానంటూ నమ్మించి ఆమెను ప్రేమ మత్తులోకి దించాడు శ్రీకాంత్ నహతా అనే ఒక ఉత్తరాది నిర్మాత. ఇక అతని వలలో పడిన జయప్రద అతను చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేసింది. ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా కరిగాయి ఇక అతను పెళ్లి చేసుకుంటాడని భావించింది. కానీ శ్రీకాంత్ నహతా కు అప్పటికే పెళ్లి జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఆ విషయం కూడా జయప్రదకు చాలా ఆలస్యంగా తెలిసింది. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయాక కళ్ళు తెరిచింది జయప్రద. ఇక అతన్ని వదిలించుకుని పెళ్లి చేసుకోకుండా తన అక్క కొడుకును దత్తత తీసుకుంది. ఆపై రాజకీయాల్లో చేరి ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు జయప్రద. యూపి నుండి ఎంపీ గా రాంపూర్ నుండి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికైంది. కెరీర్ పరంగా అద్భుతమైన సక్సెస్ చూసిన జయప్రద వ్యక్తిగతంగా మాత్రం సక్సెస్ కాలేదు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…