Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్ పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. నిర్మాతగాను దర్శకురాలిగాను ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అయితే ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్న సమయంలోనే మరొకసారి హీరో రాజశేఖర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఈ విధంగా రాజశేఖర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైనటువంటి జీవిత కేవలం తన భర్త కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఒక గృహిణిగా మిగిలిపోయారు. ఇక ఈమె సమాజంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అరాచకాల గురించి కూడా అప్పుడప్పుడు తన గళం వినిపిస్తూ ఉంటారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఇవే మహిళల గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని కుటుంబం తర్వాతే దేనిగురించి అయిన ఆలోచిస్తానని తెలిపారు. ఇక కుటుంబ బాధ్యతలతో నేను బిజీగా ఉండటం వల్ల బయటకు కూడా పెద్దగా రానని తెలిపారు. ఇక బయట ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగడం అలాంటి అలవాట్లు కూడా నాకు లేవని తెలిపారు.
సరదాలకు జండర్ తో పనిలేదు..
నేను మహిళను కాబట్టి మందు తాగకూడదని ఆలోచన నాకు లేదు నాకు ఇష్టం లేదు కాబట్టి నేను తాగను మహిళలు మందు తాగితే తప్పు లేదంటూ ఈమె తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఆడపిల్ల తాగడం ఏంటి అని ప్రశ్నిస్తే మాత్రం అసలు ఒప్పుకోను అని వెళ్లి ఎందుకు తాగకూడదు అని నిలదీస్తా అంటూ ప్రశ్నించారు. సరదాలు అనేవి అందరికీ ఉంటాయి. దానికి జెండర్ తో పనిలేదని ఈ సందర్భంగా జీవిత చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
చైనాలో సిమ్ కార్డుల నుంచి బంగారం – నెటిజన్ల ఆశ్చర్యం చైనాలోని క్యో అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో…
ప్రపంచంలో అత్యంత చవక పెట్రోల్, భారత్ పరిస్థితి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని సంవత్సరాల్లో భూకంపంలా పెరుగుతున్నాయి.…
ప్రేమికుల రోజు: గిఫ్ట్‌లు, కేకులు, ఆనందం ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 వ తేదీ ప్రపంచంలోనూ, తెలుగు రాష్ట్రాలనూ ప్రేమికుల…
తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం,…
వెండి, బంగారం ధరల్లో ఇటీవల కనిపిస్తున్న హెచ్చుతగ్గులు మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని వారాలుగా పసిడి, వెండి రేట్లు…
రంజాన్ సీజన్ ప్రారంభం, హలీం సందడి రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో హలీం విందుల…