Rashmika: రష్మిక మందన్న ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టారు. ఇలా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడంతో ఈమె ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారిపోయారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ రష్మిక ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ రష్మికకి ఒక పాడు అలవాటు ఉందట ఈమె ఇంత పెద్ద హీరోయిన్ అయినా ఇప్పటికే అలవాటు మానుకోలేదని తాజాగా రష్మికకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. మరి రష్మికకు ఉన్నటువంటి ఆ అలవాటు ఏంటి అనే విషయానికి వస్తే..
ఈమెకు స్వీట్స్ తినడం అంటే చాలా ఇష్టమట. అయితే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ స్వీట్స్ అన్ని తనకు ఒకేసారి పెట్టకుండా కొన్ని స్వీట్స్ తనకు పెట్టి మిగిలినవి డబ్బాలో దాచి పెట్టేదట కానీ స్వీట్స్ అంటే ఇష్టం ఉన్నటువంటి రష్మిక రాత్రిపూట దొంగచాటుగా కిచెన్ లోకి వెళ్లి ఆ స్వీట్స్ తినేదని తెలుస్తుంది అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయినప్పటికీ రాత్రిపూట ఈమె ఇలా కిచెన్ లోకి వెళ్లి స్వీట్స్ తింటూనే ఉంటారట.
స్వీట్స్ దొంగ…
ఇలా ఇప్పటికీ రష్మిక స్వీట్స్ దొంగగా మారిపోతాను అంటూ ఓ సందర్భంలో ఈ విషయాలను తెలియచేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు కోట్లు సంపాదిస్తున్నటువంటి నీకు ఇలా స్వీట్స్ దొంగతనం చేసి తినే అలవాటు ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె వివిధ ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…