Categories: Movie News

Jetty Movie Review: జెట్టి మూవీ రివ్యూ!

చిత్రం : జెట్టి

నటీనటులు : తేజశ్వని బెహెర, M.S. చౌదరి, జీ కిషోర్, గోపి, జీవ, మాన్యం కృష్ణ, శివాజీ రాజా, సుమన్ శెట్టి, నందిత శ్వేతా.

నిర్మాత : కే వేణు మాధవ్

బ్యానర్ : వర్థని ప్రొడక్షన్స్

దర్శకత్వం : సుబ్రహ్మణ్యం పిచ్చుక

సంగీతం : కార్తీక్ కొడకండ్ల

విడుదల తేదీ : నవంబర్ 04, 2022

Jetty Movie Review: మత్స్య కారులకు సంబంధించిన కథల్లో జీవం ఉంటుంది. అలాంటి కథలని వెండి తెరపై ఆవిష్కరిస్తే ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. గతంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత హిట్ అయిందో ఇండస్ట్రీ కి తెలుసు. తాజాగా తీరా ప్రాంతానికి చెందిన కథతో జెట్టి అనే సినిమాని తెరకెక్కించారు నిర్మాతలు. వర్ధిన్ ప్రోడక్షన్స్ అనే పతాకంపై వేణు మాధవ్ కె నిర్మించారు. ఈ చిత్రానికి సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వం వహించారు. ఇందులో తెలుగుదేశం పార్టీ ఎంపీ గళ్ళ జయదేవ్ దగ్గరి బంధువు అయిన మాన్యం కృష్ణ హీరోగా నటించారు. అతని సరసన నందితా శ్వేత హీరోయిన్ గా నటించారు. శివాజీ రాజా, కన్నడ కిషోర్, మైమ్ గోపి విలన్ గా నటించారు. ఈ చిత్రం ఈరోజే విడుదల అయింది. మరి ఎలా ఉందొ సమీక్షలో తెలుసుకుందాం పదండి.

కథ: సముద్ర తీరా ప్రాంతంలో వుండే కటారి పాలెం గ్రామానికి చాలా కట్టుబాట్లు ఉంటాయి. వాటిని ఆ ఊరి గ్రామ పెద్ద అయిన జాలయ్య(ఎం.ఎస్. చౌదరి) ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ… ఆ ఊరికి, అక్కడ వున్నా చుట్టూ పక్కల ప్రాంతానికి పెద్ద కాపుగా వుంటారు. తరచూ గ్రామానికి చెందిన మత్స్య కారుల బోట్స్ తుపానుల తాకిడికి కొట్టుకు పోయి నష్టాలను తెస్తుంటాయి. దాంతో ఎలాగైనా జెట్టి నిర్మించి మత్స్య కారులను ఆదుకోవాలని ఆ ప్రాంత ఎమ్మెల్యే అయిన దశరథ రామయ్య(శివాజీ రాజా)కి మొరపెట్టుకుంటారు. అయితే అతను ప్రతి పక్ష పార్టీ కి చెందిన ఎమ్మెల్యే కావడంతో తానూ జెట్టిని కట్టలేనని చేతులెత్తేస్తాడు. అయితే ఈ జెట్టి నిర్మిస్తే మత్స్యకారులు తమను లెక్క చేయరని విలన్ (మైమ్ గోపి ) అడ్డు తగులుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ గ్రామానికి ఉపాధ్యాయినిగా వచ్చిన శ్రీ (కృష్ణ మాన్యం) గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ… జాలయ్య కూతురు మీనాక్షి( నందిత శ్వేత) ప్రేమలో పడతారు. వీరిరువురు ఓ రోజు గ్రామ వదిలి వెళ్ళిపోతారు. దాంతో ఆ ఊరి సంస్కృతి సంప్రదాయం, కట్టు బాట్ల ప్రకారం జాలయ్య అవమానంగా ఫీల్ అవుతాడు. మరి జాలయ్య ఓ వైపు తనని నమ్ముకున్న మత్స్య కారులకి జెట్టిని ప్రభుత్వం నుంచి సాధించుకున్నారా? అలాగే ఊరి కట్టుబాట్లని లెక్క చేయకుండా ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిన తనకూతురుని ఎం చేసాడు అనేదే జెట్టి మిగతా కథ.

కథ… కథనం విశ్లేషణ: జెట్టి అంటే.. ఫిషింగ్ హార్బర్.. కోస్తాంధ్ర మత్స్య కారులకు జెట్టిలు ప్రధాన ఆదాయ వనరులు. సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెనను జెట్టి అంటారు. ఈ జెట్టి అవసరం ఏమిటనే కోణంలో ఈ సినిమా కథను తెరకెక్కించారు దర్శకుడు. ఇందులో దర్శకుడు తీరా ప్రాంతంలో ఉన్న కటారి పాలెం అనే ఓ గ్రామాన్ని తీసుకొని… ఆ ప్రాంతం, దాని చుట్టూ పక్కల వుండే సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంగా కథ నాన్ని రాసుకుని వెండితెరపై మత్స్య కారుల జీవితాన్ని ఆవిష్కరించారు. అలానే మత్స్య కారులని దోచుకునే ఓ మోతుబరి ఆ ప్రాంతాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంటాడు. అతడిపై మత్య్సకారులు ఎందుకు ఎదురు తిరిగారు అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని రాసుకున్న కథ, కథనాలు ప్రేక్షకులని కట్టి పడేస్తాయి. ఇందులో ఎంతో భావోద్వేగం ఉంటుంది. కూతుళ్ల మధ్య వుండే ఓ ఎమోషనల్ బాండింగ్‌ క్లయిమాక్స్ లో కంటతడి పెట్టిస్తుంది. ఆ ప్రాంతానికి జెట్టి తీసుకు రావడానికి ఓ తండ్రి ఏం చేశారు అనేది ఈ సినిమాకు ఆత్మ లాంటిది. జెట్టి సినిమా గుండెను బరువెక్కించే సినిమా. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది.

గ్రామ పెద్ద జాలయ్య పాత్రలో ఎమ్మెస్ చౌదరి బాగా క్యారీ చేశారు. తన్ని నమ్ముకున్న వారికి ఓ గ్రామ పెద్దగా ఎలా సహాయం చేయాలనే పాత్రని బాగా పండించారు. హీరోగా నటించిన కృష్ణ మాన్యం… స్కూల్ టీచర్ పాత్రలో ను … గ్రామాభివృద్ధికి పాటు పడే మంచి యువ ఉపాధ్యాయ పాత్రలో చక్కగా వొదిగి పోయారు. హీరో కటౌట్ కూడా ఆరడుగులు పైనే ఉండటంతో యాక్షన్ సీన్స్ లోను మెప్పిచారు. అతనికి జోడిగా నటించిన నందిత శ్వేత పైగా గ్రామీణ యువతిగా, ఫిషరీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారిణిగా చక్కగా నటించారు. విలన్ గా మైమ్ గోపి రౌద్రం పండించారు. పొలిటీషియన్ పాత్రలో శివాజీ రాజా పర్వాలేదు అనిపించాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు రాసుకున్న కథ… కథనాల్లో జీవం వుంది. ఇందులో హృదయాన్ని తాకే మట్టి పరిమళాలు వున్నాయి. దాన్ని ఇంకాస్త హృద్యంగా తెరమీద చూపించి ఉంటే బాగుండేది. సంగీతం బాగుంది. ముఖ్యనగ సిద్ శ్రీరామ్ పాడిన పాట బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!

రేటింగ్: 3

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago