Josh Ravi : జబర్దస్త్ నుండి వచ్చి కమెడియన్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్న జోష్ రవి జబర్దస్త్ కంటే ముందు నాగచైతన్య జోష్ సినిమాలో ఇండస్ట్రీ లో గుర్తింవు తెచ్చుకున్నాడు. చాలా సినిమాల్లో కమెడియన్ గా తనకంటూకమాంచి గుర్తింపు తెచుకుంటూ ముందుకు వెళ్తున్న రవి గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాతో రవికి కమెడియన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక చిరంజీవి గారంటే ఎంతో ఇష్టపడే రవి చిరంజీవి కోసం మాత్రమే ఇండస్ట్రీ కి వచ్చానంటూ చెప్తుంటాడు.
చిరంజీవి గారు మాట నిలుపుకున్నా….
చిరంజీవి గారి సినిమాలో ఒక చిన్న పాత్రయినా సరే చేసి ఆయన పక్కన నటించాలన్నదే కోరిక అంటూ చెప్పే జోష్ రవి మీలో ఎవరు కోటీశ్వరుడు చిరంజీవి చేసినపుడు ఆయన మొత్తం సినిమాల నుండి స్పూఫ్స్ ను జోష్ రవి చేసాడు. అలా చిరంజీవి గారికి తనని పరిచయం చేసుకున్న రవి తనకు చిరంజీవి అంటే ఇంత ఇష్టమో చెప్పారు. అలా ఆచార్య సినిమా టైం కి చిరంజీవి గారి వద్దకు వెళ్లి ఒక క్యారెక్టర్ ఇవ్వమని అడగడంతో ఆయన సరేనన్నారు.
అలా ఆచార్య సినిమాలో కాజల్ పక్కన నటించిన రవి. ఆమె మొత్తం సీన్స్ తీసేయడం వల్ల జోష్ రవి కూడా సినిమాలో ఎక్కడ కనిపించడు. ఒక్కసారైనా సిల్వర్ స్క్రీన్ మీద తన అభిమాన నటుడు చిరంజీవి పక్కన కనిపించాలని అనుకున్న జోష్ రవికి నిరాశ మిగిలింది. ఒక అభిమానిగా చాలా బాఫపడ్డాను అన్నయ్య మాట నిలుపుకున్నారు కానీ నాకే అదృష్టం కలిసి రాలేదు, అందుకే ఒక్కసారైనా చిన్న అవకాశం అయినా ఆయన పక్కన నటించాలని ఉందంటూ జోష్ రవి తెలిపారు. తాజాగా వచ్చిన వెబ్ సిరీస్ దయ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జోష్ రవి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…