Movie News

Josh Ravi: లక్షల్లో రెమ్యూనరేషన్ ఇచ్చిన జబర్దస్త్ కు వెళ్లను… జోష్ రవి కామెంట్స్ వైరల్!

Josh Ravi: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కొందరి కమెడియన్స్ సమయం లేక జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనటువంటి వారు కూడా ఉన్నారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కమెడియన్ జోష్ రవి ఒకరు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జోష్ రవి ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి జోష్ రవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. తాను జబర్దస్త్ కార్యక్రమంలో నటించినప్పటికీ తనకు సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ ఉండేదని తెలిపారు. ఎలాగైనా సినిమాలో సక్సెస్ సాధించాలని లక్ష్యం ఉండేదని తెలిపారు.

Josh Ravi: సినిమాలే లక్ష్యం…


ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలోనే తనకు సినిమా అవకాశాలు రావడంతో తాను ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చానని తెలిపారు. అయితే ఇప్పుడు తనకు జబర్దస్త్ కార్యక్రమంలో ఎపిసోడ్ కు లక్షల్లో రెమ్యూనరేషన్ ఇచ్చిన తాను తిరిగి వెళ్ళనని తెలిపారు. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నాలుగు సార్లు ఈ షో కి గెస్ట్ గా వెళ్లాను. సినిమాలే లక్ష్యంగా ఉన్న కారణంతో నేను జబర్దస్త్ కార్యక్రమానికి వెళ్ళనని ఈయన తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago