Categories: FeaturedMovie News

Jr NTR : నా అల్లరి తట్టుకోలేక మా అమ్మ బెల్ట్ తో చితకబాదేది.. తన బాల్యాన్ని గుర్తు చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ !

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి తారక రామారావు.. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ రూపాన్ని అందిపుచ్చుకొని.. ఆయన మళ్లీ పుట్టారా? అన్నట్టుగా సినిమాల్లో రాణిస్తూ తనను తాను నిరూపించుకున్నారు ఎన్టీఆర్. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు వచ్చినా కూడా ఎవ్వరూ జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి ఎదగలేదు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ.. ఆ తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజే వేరు.

చాలామందికి జూనియర్ ఎన్టీఆర్ బాల్యం గురించి తెలియదు. ఆయన అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తన బాల్యం గురించి చెప్పుకొచ్చారు. తను బాల్యంలో ఎలా ఉండేవారు.. బాల్యంలో ఎన్టీఆర్ చాలా అల్లరి చేసేవారట. తన అల్లరిని వాళ్ల అమ్మ అస్సలు తట్టుకోలేక తీవ్రంగా కొట్టేదట.

Jr NTR : చిన్నప్పుడు నేను చాలా నాటీ పిల్లాడిని..

నేను చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడిని. ఎంతలా అంటే మా అమ్మ నన్ను ఏది దొరికితే దానితో కొట్టేది. ఒక రోజు ఏదో తప్పు చేశా. అంతే ఇక మా అమ్మ నన్ను తీవ్రంగా కొట్టింది. ఆ తర్వాత బెల్ట్ తీసుకొని కొట్టింది. బెల్ట్ కూడా విరిగిపోయింది. ఆ తర్వాత హాంగర్ తో కొట్టింది. ఇలా చిన్నప్పుడు అయితే మా అమ్మ నేను చేసే పనులకు బాగా చితకబాదేది.. అంటూ తన చిన్ననాటి మెమోరీస్ ను ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు ఎన్టీఆర్.

Jr NTR : 11 ఏళ్లకు తాత గారిని చూశా..

జూనియర్ ఎన్టీఆర్ కు, సీనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్ ను తన 11 ఏళ్లకు చూశాడట. తనకు హై ఫీవర్ వచ్చినప్పుడు తన తాత కబురు పంపడంతో ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లాడట. అప్పుడు ఎన్టీఆర్ వయసు 11 ఏళ్లు. అప్పుడే మొదటి సారి సీనియర్ ఎన్టీఆర్ ను చూశాడట. తనను కలిశాక.. రండి.. మీ పేరేంటి అని అడిగారట. అప్పుడు మై నేమ్ ఈజీ తారక్ రామ్ అని అన్నారట జూనియర్ ఎన్టీఆర్.

Jr NTR : తారక్ రామ్ వద్దు.. తారక రామారావు గా మార్చండి

నా పేరు తారక్ రామ్ అని చెప్పగానే.. వెంటనే నాన్నను తాతయ్య పిలిచి.. మనవడి పేరు మార్చాలి. తారక్ రామ్ వద్దు.. తారక రామారావు వెంటనే మార్చండి.. అని సీనియర్ ఎన్టీఆర్.. హరికృష్ణకు సూచించారట. దీంతో అప్పటి నుంచి తారక్ రామ్ పేరు తారక రామరావుగా మారింది. ఆ తర్వాత ప్రతి రోజు తాతను కలిసి ఆయనతో గడిపే వారట జూనియర్ ఎన్టీఆర్. అలా ఓ సంవత్సరం పాటు తాతతో బాగా గడిపారట జూనియర్ ఎన్టీఆర్. అవే తన జీవితంతో బెస్ట్ మూమెంట్స్ అంటున్నారు ఎన్టీఆర్.

ఆ తర్వాత కొన్ని రోజులకు నందమూరి ఫ్యామిలీతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ కలిసిపోయిందట. తన అమ్మను కూడా సీనియర్ ఎన్టీఆర్ పిలిపించి మాట్లాడారట. చూడమ్మా.. వీడు నా వంశోద్ధారకుడు.. వీడిని నా అంతటి వాడు అయ్యేలా తీర్చిదిద్దడంలో నీ పాత్రను నువ్వు పోషించు.. నా పాత్రను నేను పోషిస్తా.. అంటూ సీనియర్ ఎన్టీఆర్.. జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పారట

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago