Jr NTR -Sampoornesh Babu:బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక ఈ కార్యక్రమం తెలుగులో ప్రస్తుతం ఆరవ సీజన్ ప్రసారం అయ్యి బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య ఇప్పటికే గొడవలు, పోట్లాటలు మొదలుపెట్టారని చెప్పాలి.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ఎ ఎన్నో సీజన్లు ప్రసారం అయినప్పటికీ బిగ్ బాస్ సీజన్ వన్ ఎంతో ప్రత్యేకమని చెప్పాలి.
ఇక ఈ సీజన్ ఎందుకంత ప్రత్యేకమైనది అనే విషయానికి వస్తే ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడమే కాకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల పట్ల ఈయన ఎప్పుడు భేదాభిప్రాయాలు చూపించలేదని ఎవరు తప్పు చేసినా మందలించడమే కాకుండా మంచి చేసిన వారిపై ప్రశంసలు కూడా కురిపించారని చెప్పాలి.
ఇకపోతే ఈ సీజన్ లోపాల్గొన్నటువంటి కంటెస్టెంట్ ధనరాజ్ తాజాగా ఈ సీజన్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ వ్యక్తిత్వం పై ప్రశంసల కురిపించారు. అసలు వారం రోజులపాటు హౌస్ లో ఎలా కొట్టుకున్నా వీకెండ్ లో ఎన్టీఆర్ గారిని చూడగానే ఎంతో సంతోషంగా ఉండేదని ఆయన ఎవరికి ఎలా న్యాయం చేయాలో వారికి న్యాయం చేయడమే కాకుండా తప్పు చేస్తున్న వారిని మందలించే విషయంలో కూడా ముందుంటారని ధనరాజ్ చెప్పారు.
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ సంపూర్ణేష్ బాబు కోసం ఏకంగా బిగ్ బాస్ నిర్వాహకులతో ఫైట్ చేశారని ధనరాజ్ వెల్లడించారు. సంపూర్ణేష్ బాబు పెరిగిన వాతావరణం, బిగ్ బాస్ వాతావరణం పూర్తిగా విభిన్నం. అయితే సంపూర్ణేష్ బాబు హౌస్ లోకి వచ్చిన కొద్ది రోజులకే సిక్ అయ్యారు. ఆ కార్యక్రమం నుంచి తను బయటకు వెళ్లాలంటే 25 లక్షలు కట్టి వెళ్లాలి.ఈ సమయంలో ఎన్టీఆర్ సంపూర్ణేష్ బాబు కోసం ఫైట్ చేస్తూ నేను హోస్ట్ చేస్తున్న పస్ట్ షోలో అలా చేయకండి అని చెప్పడమే కాకుండా మరి డబ్బు కట్టాల్సి వస్తే ఆ 25 లక్షలు నేనే కడతా అంటూ సంపూర్ణేష్ బాబు కోసం ఎన్టీఆర్ ఫైట్ చేశారని ఈ సందర్భంగా ధన్ రాజు బయటపెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…