Jr.NTR: హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి అవార్డు వేడుకలలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ అవార్డు ప్రజెంటేటర్ గా సందడి చేశారు. అదేవిధంగా RRR సినిమాకు గాను ఎన్నో అవార్డులను అందుకున్నారు. అయితే ఈ అవార్డుల వేడుకలకు ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేకపోయారు.
ఇలా రామ్ చరణ్ మాత్రమే ఆహ్వానించి ఎన్టీఆర్ కు ఆహ్వానం అందించకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఇదంతా మెగా పెయిడ్ బ్యాచ్ అంటూ పెద్ద ఎత్తున రామ్ చరణ్ పై ఆయనకు అందుతున్న గౌరవం పై నందమూరి అభిమానులు మండిపడుతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎన్నో అవార్డులను అందుకున్నటువంటి RRR సినిమాలో రామ్ చరణ్ మాత్రమే కాదు ఎన్టీఆర్ పాత్ర కూడా కీలకంగా ఉందని అయితే ఆయనకు సరైన గౌరవం దక్కలేదంటూ ఎన్టీఆర్ అభిమానులు ఏకంగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియాలో ఒక సినిమాతో బిజీగా ఉండటం వల్ల తాము ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేకపోయామని తెలిపారు. అయితే త్వరలోనే ఆయనకు చెందాల్సిన అవార్డును తనకు అందజేస్తామని క్లారిటీ ఇచ్చారు.అయితే ఎన్టీఆర్ ఇక్కడ ఎలాంటి సినిమాలలోను పాల్గొనలేదనేది అందరికీ తెలిసిందే. కాకపోతే ఎన్టీఆర్ కొరటాల సినిమా ప్రారంభం కావాల్సి ఉండగా తన అన్నయ్య తారకరత్న మరణించడంతో ఇది వాయిదా పడింది. త్వరలోనే ఎన్టీఆర్ కు సైతం హెచ్సీఏ అవార్డును అందించబోతున్నట్లు వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…