NTR: నందమూరి కుటుంబం నుండి ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. మొన్నటిదాకా టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అవ్వడంతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. నిత్యం సినిమా పనులతో బిజీగా ఉండే ఎన్టీఆర్ కుటుంబం కోసం కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు.
ఇదిలా ఉండగా గతంలో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకోకముందు జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో కాబోయే భార్య గురించి తారక్ మాట్లాడుతూ…” జీవితంలో ఏది జరిగితే దానిని యాక్సెప్ట్ చేయాలే తప్ప ప్లానింగ్ అంటూ ఏమీ లేదని అన్నారు. అలాగే కాబోయే భార్యలో ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడుతూ..మా అమ్మను బాగా చూసుకునే అమ్మాయి నాకు భార్యగా ఉండాలని కోరుకుంటున్నానని తారక్ తెలిపారు.
అంతే కాకుండా తనకు అమ్మే ప్రపంచమని, అమ్మను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. అయితే ఎన్టీఆర్ తాను కోరుకున్నట్లుగా తన తల్లిని బాగా చూసుకునే అమ్మాయి భార్యగా దొరికిందని ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ ప్రణతి నందమూరి ఇంటి కోడలిగా వంశ గౌరవాన్ని నిలబెడుతుందని, స్టార్ హీరో భార్య అయినప్పటికీ గొప్పలకు పోకుండా ఎంతో సింపుల్ గా ఉంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
NTR: నందమూరి వంశ గౌరవాన్ని నిలబెట్టిన ప్రణతి..
ఒక భార్యగా, కోడలిగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా లక్ష్మీ ప్రణతి చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. లక్ష్మీ ప్రణతి ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా కుటుంబంతో ఎక్కువ సమయం కేటాయిస్తుంది. ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు ఇటీవల ప్రారంభమైంది.
టాలీవుడ్‌లో మరో స్టార్ పెళ్లి సందడి మొదలైంది. నటుడు Vijay Deverakonda ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.…
శీతాకాలం వచ్చిందంటే వీధి మూలల్లో వేడి వేడి పల్లీలు అమ్మే దృశ్యాలు సాధారణం. వేరుశనగలు చాలామందికి ఇష్టమైన స్నాక్. తక్కువ…
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో అరటిపండు ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలో లభించడం, తేలికగా జీర్ణమవడం, తక్షణ శక్తిని అందించడం…
ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…
అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…
బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…