Actress Rambha: సౌత్ ఇండస్ట్రీ లో గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అలనాటి హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన లేదు. తెలుగు, తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా గుర్తింపు పొందిన రంభ కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది.
ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ గురించి రంభ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రంభ తన సినీ జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూ లో రంభ మాట్లాడుతూ…” ఇండస్ట్రీలో తనకు ఎవరూ పోటీ కాదని అందరూ కోపరేటివ్ గా ఉండేవారని తెలిపింది. హీరోయిన్స్ లో తనకు త్రిష ఇష్టమని తెలిపింది. అంతే కాకుండా ప్రభాస్, మహేష్ తో సినిమాలు చేయాలని ఉందని చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత తాను నటించిన స్పెషల్ సాంగ్స్ గురించి మాట్లాడుతూ…తాను చేసిన ఐటమ్ సాంగ్స్ లో నాచోరే నాచోరే సాంగ్ అంటే ఇష్టమని తెలిపారు. ఆ పాటలో ఎన్టీఆర్ ఎక్కువగా కష్టపడితే తనకు మంచి పేరొచ్చిందని తెలిపింది. అంతే కాకుండా తన దృష్టిలో మైకేల్ జాక్సన్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అని తెలిపింది. ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తే కన్నార్పకుండా చూస్తానని ఆమె చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ డెడికేషన్ చూస్తే పిచ్చెక్కుతుందని రంభ జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ గురించి గొప్పగా చెప్పింది.
Actress Rambha: ఎన్టీఆర్ డెడికేషన్ చూస్తే పిచ్చెక్కుతుందని …
ఆమె చెప్పటం అటుంచితే టాలివుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో అతి తక్కువ మంది మాత్రమే మంచి డాన్సర్లు. వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఇక రంభ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. వివాహాం తరువాత భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి విదేశాలలో సెటిల్ అయ్యింది. ఇక రంభ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల తనకు కారు యాక్సిడెంట్స్ జరిగిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…