Rashmika: నేషనల్ క్రష్ రష్మిక … ఈ పేరు గురించి తెలియని వారంటూ ఉండరు. కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా మారిన రష్మిక ఇప్పుడు ఇటు సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రష్మిక ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకొని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.
ఇక గతేడాది విడుదలైన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలలో నటించి అందరినీ మెప్పింది. పుష్ప సినిమా తో పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ ఇంటర్వ్యులో ఆమె మాట్లాడుతూ…” నటిగా నేను ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా నా విషయంలో నా తల్లి తండ్రులు ఇంకా గర్వపడలేదు.
చిత్ర పరిశ్రమలో నేనేం చేస్తున్నానో వారికి తెలియదు. ఎందుకంటె వారు మొదటి నుండి సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. అయితే నా నటనకు అవార్డులు వచ్చినప్పుడు మాత్రం వారు ఆనందిస్తారు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే నా పని గురించి వారికి పూర్తి అవగాహన లేకపోయినా కూడా నాకు అవసరమైనవి అన్ని సమకూరుస్తున్నారు అని రష్మీక తెలిపింది. అందుకే నేను వారిని గర్వపడేలా చేయటానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది” అని తెలిపింది.
Rashmika: తల్లిదండ్రుల కష్టం చూసాను…
నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన రష్మీక ఇటీవల ఐఎండిబీ రూపొందించిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది. ఇక రష్మీక సినిమాల విషయానికి ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమాతో పాటు మరో రెండు సినిమాలలో నటిస్తోంది. అలాగే హిందీలో కూడా ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…