NTR: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలు ఎవరికీ ఊహకందని విధంగా ఉన్నాయని చెప్పాలి. ఏకంగా కూటమి నేతలు 164 సీట్లతో ఘనవిజయం సాధించి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా కూటమి గెలవడంతో పెద్ద ఎత్తున కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఏపీ ఎన్నికల ఫలితాలలో భాగంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ సాధించడంతో సినిమా ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం సోషల్ మీడియా వేదికగా కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
మామయ్య చంద్రబాబు నాయుడు లోకేష్ భరత్, అత్తయ్య పురందేశ్వరి, బాబాయ్ బాలకృష్ణకు అలాగే పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు అంటూ ఈయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇలా కూటమి విజయం పై ఎన్టీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేయడంతో ఎన్టీఆర్ ట్వీట్ పై చంద్రబాబు స్పందించారు.
థాంక్యూ సో మచ్..
ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కి చంద్రబాబు నాయుడు రిప్లై ఇస్తూ థాంక్యూ సో మచ్ అమ్మ అంటూ రాసుకు వచ్చారు. ఇలా ఎన్టీఆర్ ట్వీట్ కి చంద్రబాబు రియాక్ట్ కావడంతో ఇటు తెలుగు తమ్ముళ్లు అలాగే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను కాస్త దూరం పెడుతూ వస్తున్నప్పటికీ తారక్ మాత్రం స్పందించాల్సిన సమయంలో స్పందిస్తూ వస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…