Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన వారితో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
ప్రజలు మనల్ని నమ్మి కనివిని ఎరుగని రీతిలో మనకు విజయాన్ని అందించారు. అయితే వారు అందించిన ఈ విజయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి ఎంతో బాధ్యతగా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విజయం మనందరిపై మరింత బాధ్యతను పెంచిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ప్రజలు తమ కష్టం నుంచి పన్నుల రూపంలో కట్టే సొమ్మును.. ఓ ప్రజాప్రతినిధిగా జీతం రూపంలో బాధ్యతగా తీసుకుంటాను. రూపాయి మాత్రమే జీతం తీసుకుంటాననే ఆర్భాటపు మాటలు మాట్లాడను. ఖజానా నుంచి సంపూర్ణంగా జీతం తీసుకుంటాను. అలా తీసుకుంటేనే ప్రజలకు నాపై అజమాయిషి చేసే హక్కు కూడా ఉంటుందని తెలిపారు.
1000 రెట్లు పనిచేస్తా…
నేను తీసుకొని జీతానికి ప్రతి రూపాయికి వెయ్యిరెట్లు కష్టపడి పని చేస్తానని, కష్టాల్లో ఉన్న ప్రజలకే ఇస్తాను. ప్రజలకు వారి అన్ని కష్టాల్లోనూ అండగా నిలుస్తానని పవన్ తెలిపారు. సినిమాలకు సెన్సార్ ఉంటుంది కానీ టీవీలకు ఉండదు. మనం ఇక్కడ ఏం మాట్లాడితే ప్రజలలోకి అదే వెళ్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండాలని అందరికీ స్ఫూర్తిగా జనసేన ప్రయాణం కొనసాగాలని పవన్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…