AP Volunteer: ఏపీలో గత ప్రభుత్వం తీసుకు వచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాలి. అయితే గతంలో ఈ వాలంటీర్ వ్యవస్థను విమర్శించిన ప్రతిపక్ష నేతలు ఇప్పుడు ఎన్నికలలో అదే అస్త్రంగా భావించి విజయం సాధించారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసివేయమని వారి పారితోషికం కూడా పదివేలకు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ఎన్నికలలో గెలిచారు.
ఇక చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలోనే వాలంటీర్ వ్యవస్థ గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసే విషయంపై పలు మార్పులు కూడా చేశారని తెలుస్తోంది. గతంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండేవారు కానీ ఇకపై ప్రతి గ్రామానికి కేవలం ఐదుగురు వాలంటీర్లు మాత్రమే ఉంటున్నారని సమాచారం.
వాలంటీర్లు కేవలం గ్రామస్థాయిలో మాత్రమే కాకుండా మండల స్థాయిలో కూడా విదులకు హాజరు కావాల్సి ఉంటుందని వెల్లడించారు. అలాగే వాలంటీర్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకునేవారు డిగ్రీ కూడా పూర్తి చేసి ఉండాలని తెలిపారు. అలాగే వాలంటీర్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకునే వాళ్ళు 1993 నుంచి 2004 మధ్య జన్మించిన వారై ఉండాలని వెల్లడించారు.
డిగ్రీ ఉత్తీర్ణత..
ఇక పింఛన్ పంపిణీ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం పింఛన్ దారులకు బ్యాంకు లోనే పెన్షన్ వేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇదే పద్ధతిని అనుసరించాలా లేకపోతే ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేయాల అనే విషయంపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ సిబ్బందులు వాలంటీర్లు కూడా సర్పంచుల కింద పనిచేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…