Poonam kaur: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ ఎన్నికలలో భాగంగా కూటమి ఏకంగా 164 స్థానాలలో అద్భుతమైన విజయం సాధించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ మెజారిటీ సాధించిన కూటమి సభ్యులకు ఇప్పటికే చిత్ర పరిశ్రమ అలాగే దేశవ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సినీనటి పూనమ్ ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈమె సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్ చేశారంటే అది ఎవరిని ఉద్దేశించి చేశారో అన్నది మాత్రం అర్థం కాదు కానీ ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించి పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పోస్టులు చేసిన పూనం తాజాగా మరోసారి స్పందించారు.
ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ ఈమె ‘వై నాట్ 175 అనే విషయాన్ని ఏపీ ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు’ అంటూ పోస్ట్ చేసింది. దీనికి #andhrapradesh అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించింది. పూనమ్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
వై నాట్ 175..
జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. కానీ ఈ ఎన్నికలలో భాగంగా ఆయనకు కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో వారికి కౌంటర్ ఇస్తూ ఇలాంటి పోస్ట్ చేశారా ఏంటి అంటూ నేటిజన్స్ ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఈమె చేసిన ఈ పోస్ట్ సంచలనంగా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…