Junior Srihari : గత ఆదివారం నాడు రక్తపు వాంతులు, విరేచనాలతో రాకేష్ మాస్టర్ గాంధీ హాస్పిటల్ లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనది సహజ మరణం అని అందరూ భావించినా, తాగుడు ఎక్కువై ఆరోగ్యం పాడై పోయి మనిషి చనిపోయాడని అందరూ భావించినా ఆయన దగ్గరున్న వాళ్ళు ఆయన శిష్యులు మాత్రం ఆయనది సహజ మరణం కాదు, ఎవరో చనిపోయేలాగా కొట్టారు అంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ కు సన్నిహితుడైన జూనియర్ శ్రీహరి అలియాస్ హేమంత్ అనే వ్యక్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాస్టర్ మరణం గురించి మాట్లాడారు.
బాగా తాగారు… స్వాతి నాయుడు వల్ల గొడవ…
విజయనగరంలో ఒక యూట్యూబ్ ఛానెల్ కోసం షూటింగ్ కి వెళ్లిన రాకేష్ మాస్టర్ గారితో పాటు యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫేమస్ అయిన చాలా మంది ఉన్నారు, అందులో జూనియర్ శ్రీహరిగా పిలవబడే హేమంత్ అలాగే పుల్లయ్య, వైజాగ్ దయ వంటి వారు ఉండగా మాస్టర్ గారితోనే జూనియర్ శ్రీహరి ఉన్నారట. అయితే షూటింగ్ అయ్యాక రిసార్ట్స్ లో ఉన్నపుడు అర్ధరాత్రి కొంతమంది వచ్చి మాస్టర్ తో ఫోటో తీయించుకోవాలని అడిగి అయ్యాక స్వాతి నాయుడు ను పిలవాలని అనడం, ఈ టైములో కాదు పొద్దున్నే రండి అని చెప్పడంతో గొడవ జరిజి అప్పటికే అందరూ తాగి ఉండటం వల్ల ఇరువైపులా గొడవ పడ్డారట.
అయితే ఆ సమయంలో రాకేష్ మాస్టర్ మీద ఎలాంటి దెబ్బ పడలేదని జూనియర్ శ్రీహరి తెలిపారు. అయితే మందు మాత్రం ఎక్కువగా ఆ పది రోజులు తీసుకున్నారని అప్పటికే ఆయన ఆరోగ్యం బాగోలేదు. మరో రెండు నెలలే ఆయన బ్రతుకుతారు అనే విషయం అప్పటికే ఆయనకు తెలుసు కానీ మాకెవరికీ చెప్పలేదు అంటూ జూనియర్ శ్రీహరి తెలిపారు. ఇక అక్కడ షూటింగ్ అపుడు సునిశిత్ కోసం కూడా గొడవ జరిగింది. వాటిలో రాకేష్ మాస్టర్ గాయపడింది లేదు. హైదరాబాద్ వచ్చేటపుడు ఆయన బాగానే ఉన్నారు అంటూ చెప్పారు జూనియర్ శ్రీహరి. ఇక రూమ్ కి వచ్చాక ఏం జరిగిందో తెలియదు. ఆయన ఫోన్ పోవడం నిజం కానీ ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించారు అనుకుంటున్నాం అని జూనియర్ శ్రీహరి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…