కొన్ని వింతలు అరుదుగా మాత్రమే చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ వింతలను చూడటం మిస్ అయితే మళ్లీ చూడటం కోసం దశాబ్దాల పాటు, శతాబ్దాల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ నెల 21వ తేదీన ఆకాశంలో ఒక వింత చోటు చేసుకోనుంది. నిపుణులు చెబుతున్న ప్రకారం శని, గురు గ్రహాలు ఒకదానికొకటి సమీపంలోకి చేరుకోనున్నాయి. 1623 సంవత్సరంలో ఇలా జరగగా మళ్లీ 400 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది.
జ్యుపిటర్, శాటర్న్ గ్రహాలు 21వ తేదీన ప్రకాశవంతమైన నక్షత్రంలా కనిపిస్తాయి. బిర్లా ప్లానెటేరియం డైరెక్టర్ దేబి ప్రసాద్ దువారీ అరుదుగా కనిపించే ఈ అద్భుతాన్ని గ్రేట్ కంజంక్షన్ అని పిలుస్తారని పేర్కొన్నారు. ఖగోళ గ్రహాలైన జ్యుపిటర్, శాటర్న్ ఒకదానికొకటి దగ్గరగా సమీపంచడం వల్ల దానిని కంజంక్షన్ పేరుతో పిలుస్తారు. ఎవరైతే ఇప్పుడు ఈ అరుదైన దృశ్యం చూడటం మిస్ అయితే మళ్లీ 2080లో ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి సమీపంగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గురు, శని గ్రహాలు 2080 సంవత్సరం మార్చి 15వ తేదీన మళ్లీ ఒకదానికొకటి సమీపంగా రానున్నాయి. ఇప్పుడు ఊహ తెలిసిన వాళ్లలో 2080 నాటికి జీవించి ఉంటారో లేదో చెప్పడం కష్టం. అందువల్ల వీలైతే ఈ దృశ్యాన్ని చూడటం మంచిది. డిసెంబర్ 15వ తేదీన రెండు ఖగోళ గ్రహాల మద్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుందని ఇంత తక్కువ దూరంలో రెండు గ్రహాలు ఉండటం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
డిసెంబర్ 21వ తేదీన సూర్యుడు అస్తమించిన తరువాత ఈ అరుదైన దృశ్యాన్ని చూడవచ్చు. డిసెంబర్ 21 వరకు ప్రతిరోజూ దూరం క్రమంగా తగ్గి అద్భుతమైన కంజంక్షన్ మన కళ్లకు కనిపిస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…