K S Ramarao : తెలుగు సినిమా బడా ప్రొడ్యూసర్స్ లో కే ఎస్ రామారావు గారు ఒకరు. దర్శకుడు కే రాఘవేంద్ర రావు వంటి వారు పరియిచయమయ్యాక 1983 లో అభిలాష సినిమాకు నిర్మాతగా మారారు. ఇక ఆ తరువాత మరణమృదంగం, స్వర్ణ కమలం, ముద్దమందారం, మాతృదేవోభవ, క్రిమినల్, ఇక కొత్తగా దమ్ము, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కౌసల్య కృష్ణమూర్తి, ఇక ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలను తీసారు.
దిల్ రాజు, సురేష్, అరవింద్, సునీల్ నారాయణ చేతుల్లో ఇండస్ట్రీ ఉంది…
ఇక తాజాగా ఆయన సినిమా ఇండస్ట్రీ పై చేసినా వాఖ్యలు ఆసక్తికరంగాను, వివాదాస్పదంగాను ఉన్నాయి. ‘ఐ క్యు’ అనే సినిమా ముహూర్తం షాట్ కి అతిధిగా వచ్చిన రామారావు గారు ఇండస్ట్రీ పెద్దల గురించి కామెంట్స్ చేసారు. సినిమాను తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడం మరో ఎత్తు అని అందుకోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిందే అంటూ చెప్పారు. ఐ క్యు సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ శ్రీనివాస్ గారు. ఇక ఆయనను ఉద్దేశించి ఇలా మైల్డ్ గా ఉండకూడదు బాగా మాట్లాడాలి. ఇపుడున్న జనరేషన్ లో సినిమాను ప్రమోట్ చేసి సోషల్ మీడియా ద్వారా యూత్ లోకి తీసుకెళ్తేనే సినిమాను థియేటర్స్ కి వచ్చి చుస్తున్నారు లేదంటే టీవీ లో వచ్చినప్పుడో, ఓటీటీ లో విడుదలయినపుడు చూద్దాంలే అనుకుంటున్నారు.
మీరు ఎంత కష్టపడి సినిమా తీసినా ఇండస్ట్రీలో ఆ నలుగురు తలుచుకోక పోతే సినిమా ప్రేక్షకుడి దగ్గరకు చేరదు. దిల్ రాజు, దగ్గుబాటి సురేష్, సునీల్ నారాయణ, అల్లు అరవింద్ వీరే ఇండస్ట్రీ ని డామినేట్ చేస్తున్నారు. ఈ నలుగురు, ఒక ఐదుగురు టాప్ హీరోస్ వాళ్ల సినిమా బడ్జెట్లు అంత ఎక్కువ ఉంటున్నాయి. వాళ్లకు నచ్చినట్టు బడ్జెట్లో, నచ్చినప్పుడు, ఎక్కువ థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తున్నారు. ఇదంతా వసూలు చేసుకోడానికి టికెట్ల రేట్లను పెంచుకుంటున్నారు అంటూ పరోక్షంగా కామెంట్ చేసారు. చిన్న సినిమాలను బాగా ప్రమోట్ చేసుకుంటే గాని ప్రేక్షకుల దగ్గరికి చేరవంటూ చెప్పి ఐక్యు చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…