Featured

KA Paul : నన్ను కమెడియన్ ను చేసింది ఆ రెండు ఛానెల్సే : కేఏ పాల్

KA Paul : గ్లోబల్ పీస్ మేకర్ గా అందరికీ తెలిసిన పాల్ పుట్టింది ఆంధ్రప్రదేశ్ చిట్టివలస గ్రామం.. పదవతరగతి కూడా పూర్తి కాని పాల్ మత ప్రచారకుడిగా తన తండ్రి తో కలిసి వెళ్తూ అలా గోస్పల్ ఫౌండేషన్ లో అన్నీ తానై క్రిస్టియానిటీ బోధకుడిగా మారారు. తన ఎనిమిదవ ఏట క్రిస్టియనిటి స్వీకరించిన కే ఆనంద్ పాల్ ఆ తరువాత దేశ విదేశాల అగ్ర నాయకులను కలిసి సేవా కార్యక్రమాలకు నిధులను సమాకూర్చుకునేవాడు. ఆయన పీస్ మేకర్ గా అగ్ర నాయకులతో మాట్లాడి ఎన్నో యుద్దాలను జరగకుండా ఆపేసారు అంటూ ఆయన గురించి చెబుతారు. ఎన్నో లక్షల కుటుంబాలకు వారి ఫౌండేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చదువు, ఆరోగ్య సేవలు ఇలా అందిస్తున్న కేఏ పాల్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ చేసారు. పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక నేటి రాజకీయాల గురించి నాయకుల గురించి అలాగే అవినీతి గురించి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఆ రెండు ఛానెల్స్ మాత్రమే నన్ను కమెడియన్ ను చేసాయి…

కేఏ పాల్ కు ఏ భారతీయుడికీ దక్కని అరుదైన గౌరవం ఉంది అదే అమెరికన్ ప్రెసిడెంట్ కి మాత్రమే ఉండే బోయింగ్ విమానం మన కేఏ పాల్ కి ఉండటం. ఆయన పీస్ అంబాసిడర్ గా ప్రపంచదేశాలలో తిరిగడానికి బోయింగ్ 747 ఎస్పి విమానం ఇప్పటికీ అమెరికా రాష్ట్రాలలో ఉన్నది. ఇక ఆయనకు ఎన్నో దేశాల్లో ప్రభుత్వాలు ఆయన చారిటీ సంస్థలకు కొన్ని వందల ఎకరాలను దానం చేసాయి. వాటిలో ఆయన చారిటీ పనులు జరుగుతున్నాయి. అయితే ఇదంతా ఇండియా వెలుపల ఘనత ఎందుకంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆయనను కమెడియన్ గా చిత్రీకరించారు.

ఇక ఈ విషయం గురించి పాల్ మాట్లాడుతూ ఇప్పటివకు దాదాపు 40 లక్షల మందికి చదువు చెప్పించామని అలాగే ఎంతో మందికి ఆరోగ్య సేవలను అందిచామని చెప్పారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన సేవలను గుర్తించకుండా ఒక కమెడియన్లా చూస్తున్నారు. ఒక రెండు మీడియా సంస్థలు మాత్రమే అలా చిత్రీకరిస్తున్నాయి, బయట అలా లేదు జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అంటూ కేఏ పాల్ వివరించారు. ఆ రెండు మీడియా సంస్థలు అవినీతి సొమ్ముతో వచ్చినవే, అధికార పార్టీలకు సంబందించినవి అంటూ చెప్పారు. వితంతులను, పిల్లలను కలిసినపుడు వారితో కలిసి డాన్స్ చేయడం తప్పు అన్నట్లుగా నన్ను చిత్రీకరించారు. కానీ బయట జనం అలా నన్ను చూడటం లేదు, నా రాజకీయ పార్టీ ద్వారా సేవలందించాలని చాలా మంది అనుకుంటున్నారంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

5 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

5 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

5 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

6 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

8 hours ago