Senior journalist Imandhi Ramarao : వి బి రాజేందర ప్రసాద్ గారి అబ్బాయి గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జగపతి బాబు ‘సింహ స్వప్నం’ సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. ఆ తరువాత అడివిలో అభిమన్యుడు సినిమా తీసినా పెద్దగా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. అయితే ఆ తరువాత తీసిన పెద్దరికం, గాయం, అంతఃపురం వంటి సినిమాలతో మంచి నటుడుగానూ అలాగే హీరోగా కమర్షియల్ సక్సెస్ లు అందుకున్నాడు. ఇక శుభలగ్నం, మావిచిగురు వంటి సినిమాలతో అవార్డులను కూడా కొల్లగొట్టాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ‘లెజెండ్’ సినిమాలో విలన్ గా నటనకు మంచ పేరు వచ్చింది. ఇక ఆయన వ్యక్తిగత జీవితం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.
సౌందర్య తో మంచి స్నేహం ఉండేది…
జగపతి బాబు మావిచిగురు, శుభలగ్నం వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువై మహిళా ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా విలన్ గా ప్రస్తుతం సక్సెస్ ఫుల్ కెరీర్ లో ఉన్న ఆయన సౌందర్య మరణించినపుడు ఆయనా మరణించాలని అనుకున్నాడట. సౌందర్య తో మొదటి నుండి మంచి స్నేహం ఉన్న ఆయన ఆమె మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట.
అయితే ఆ సమయంలో ఆయన భార్య ఆయనను మళ్ళీ మామూలు స్థితికి తీసుకువచ్చారు అంటూ ఇమంది గారు చెప్పారు. ఇక ఆయనకు రేసు గుర్రాలు ఉండటం, ఆ గుర్రపు పందేలు ఆడే అలవాటు ఉండటం వల్ల ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. చివరికి ఇల్లు కూడా అమ్మేసినా ఆయన మళ్ళీ లెజెండ్ సినిమా వల్ల నిలబడ్డారు అంటూ ప్రస్తుతం తమిళ, మలయాళం, కన్నడ, భాషల్లో కూడా బిజీ విలన్ అయిపోయారని తెలిపారు
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…