Kadhambhari Kiran : తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఒక డైరెక్టర్ గా, సీరియల్ ప్రొడ్యూసర్ గా అందరికి సుపరిచితుడైన కాదంబరి కిరణ్ తన సినిమా చేదు అనుభవాలతో పుస్తకాన్ని కూడా రాస్తున్నానని చెప్పారు. కిరణ్ మొదట జర్నలిస్ట్ గా ఈనాడు లో పనిచేస్తూ ఉన్నపుడే సీరియల్స్ లో నటించారు. ఇక చాలా సీరియల్స్ కి ప్రొడ్యూసర్ గా ఉండి చాలా డబ్బు నష్టపోయినట్లు చెప్పారు కిరణ్. ఇక ఏఎన్ఆర్ గారితో మంచి అనుబంధం కలిగి ఉన్నా కాదంబరి గారు ఇండస్ట్రీ లో తాను ఎదగక పోడానికి కారణాలను తాజా ఇంటర్వ్యూ లో వివరించారు.
నాగార్జున తో సినిమా చేయలేక పోయాను…
డైరెక్టర్ గా మొదటి సినిమా ‘కుర్రాళ్ళ రాజ్యం’, ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిన సమయంలో ఏం చేయాలో ఇండస్ట్రీ లో ఆర్టిస్ట్ గా ఉండాలా లేక డైరెక్టర్ గా కొనసాగాలా అనే సంశయంలో ఉన్నాను. అయితే ఇండస్ట్రీ తప్ప నాకు బయట ప్రపంచం తెలియదు అందుకే ఇక్కడే ఉండాలి అని నిర్ణయం తీసుకున్నా అని కిరణ్ చెప్పారు. ఇక అక్కినేని వారి ఇంట్లో రెండున్నర గంటలు కథ చెప్పడానికి కూర్చో పెట్టిన ఘనత ఒక ముగ్గురు డైరెక్టర్లకే ఉంది అందులో నేను ఒకడిని. నాగార్జున గారికి పల్లెటూరి సినిమా పేర్లంటే ఇష్టం అందుకే బావ కథ చెప్పగానే నచ్చింది. రెండున్నర గంటలు స్టోరీ విన్నాడు. మొత్తం కథలో రెండు సన్నివేశాలను మార్చమని చెప్పాడు. అయితే మళ్ళీ ఇంతవరకు ఆ మార్చిన సీన్స్ వినలేదు. ఆరోజు కథ విన్నప్పుడు అక్కడ ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు ఉన్నారు. అందులో ఒకాయన నన్ను పక్కకు పిలిచి చినబాబు ని ఇంతసేపు కూర్చోబెట్టావ్ నీ కథతో, నీకు టాలెంట్ ఉంది అంటే ఆది పొగడ్త అనుకున్నా కాదు అని చాలా రోజులకు అర్థమైంది. అతనికి కాలి ఆ మాట అన్నాడు.
ఇక అక్కడితో నాకు నాగార్జున కి కనెక్షన్ పోయింది. అయినా నాగార్జున తో సినిమా చేయనంత మాత్రాన నేనేం చనిపోలేదు బ్రతికే ఉన్నాను, ఇండస్ట్రీ లోనే ఉన్నాను. నాగేశ్వరావు గారు నా హీరో, ఆయనతో చాలా సన్నిహిత్యం ఉండేది ఒక్కోసారి నాగార్జున ఆయనతో ఏదైనా చెప్పాలంటే నాకు చెప్పి చెప్పమనేవారు. అలానే నాగేశ్వరావు గారి జీవిత విశేషాలను ఆయన అనుభవాలను నేటి తరానికి చెబితే ఉపయోగకరంగా ఉంటుందని ఆయనను ఒప్పించాను కానీ యాంకర్ గా వేరే వాళ్ళను నాగార్జున పెట్టారు అది అతని మార్కెటింగ్ వ్యూహం, తప్పు కాదు అని చెప్పారు. ఆ కార్యక్రమానికి పేరును నాగేశ్వరావు గారే గుర్తుకొస్తున్నాయి అంటూ సూచించారు అని కిరణ్ తన సినిమా అనుభవాలు చెప్పారు. ఇక ప్రతి కొత్త ఛానెల్ లోనూ సీరియల్స్ ప్రొడ్యూసర్ గా నిర్మించాను కానీ అన్ని నష్టాలను మిగిల్చాయి. డబ్బులన్నీ కోల్పోయాను ఇక ఆర్టిస్ట్ గా ఎవరూ నాకు అంత అవకాశలు ఇవ్వలేదు. నువ్వు ఒకప్పుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంటూ ఆర్టిస్ట్ గా కూడా నన్ను దూరం పెట్టారు అని కిరణ్ ఆయన అనుభవాలను చెప్పారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…