Kajal Agarwal: చిన్న చిన్న విషయాలే ఆనందాన్నిస్తాయి.. కొడుకును చూస్తూ మురిసిపోతున్న కాజల్!
Kajal Agarwal: వెండితెర చందమామగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్రహీరోల సరసన నటిస్తూ నటిగా గుర్తింపు పొందారు. ఇకపోతే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
వివాహం తర్వాత కూడా కాజల్ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈమె గర్భవతి అని తెలియగానే సినిమాల నుంచి పూర్తిగా తప్పుకొని తన మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తూ ఆ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇకపోతే కాజల్ ఏప్రిల్ 19వ తేదీ పండటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన బాబుకు నీల్ కిచ్లు అని నామకరణం చేశారు.
ఇక నిత్యం కాజల్ అగర్వాల్ తన కొడుకుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన కొడుకు ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు తన కొడుకు మొహాన్ని కనపడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విధంగా తన కొడుకు ఫోటోలు షేర్ చేస్తూ తన కొడుకు పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తున్నారు.
తాజాగా మరొక ఫోటోని ఈమె షేర్ చేస్తూ.. తన కొడుకుని చూస్తూ మెరిసిపోతోంది. ఈ క్రమంలోనే ఈ ఫోటోని షేర్ చేస్తూ చిన్న చిన్న విషయాలే ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయనే క్యాప్షన్ జోడించారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే కాజల్ అగర్వాల్ కొడుకు ఫోటోని చూడటం కోసం అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ తిరిగి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…