ఎలాంటి సినీ నేపథ్యం లేకున్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగి ఆ తర్వాత హీరోగా అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండటం కాకుండా మరోవైపు నిర్మాతగా మారారు.
నాని నిర్మాతగా మారి ఎంతోమంది కొత్త వారికి ఇండస్ట్రీలో అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నాని “మీట్ క్యూట్”అనే సినిమాను నిర్మించబోతున్నారు. ఇందులో సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించనున్నారు. అదేవిధంగా నాని నిర్మించబోయే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉన్నారనే విషయం ఇదివరకే ప్రకటించారు. అయితే వారు ఎవరూ ఏంటి అనే విషయాలను ఇది వరకు తెలియజేయలేదు.
నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న మీట్ క్యూట్ కి నాని అక్క దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో భాగంగా ఐదుగురిలో ఒకరిగా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా కథను నాని కాజల్ అగర్వాల్ కు వివరించగా కథ నచ్చడంతో ఆమె కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే ఈ విషయం గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇకపోతే కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…