టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత యేడాది ఈమె తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి అయినప్పటికీ ఈ బ్యూటీ ఏమాత్రం తగ్గకుండా అదే రీతిలో సినిమాలు కొనసాగిస్తోంది. పెళ్లి తర్వాత కూడా అదే జోష్ తో సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఆచార్య సినిమాలో నటిస్తూనే మరో రెండు మూడు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ కు సంబంధించి ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. కాజల్ కూడా తన భర్తని ఒక నటుడిగా మార్చాలని తాపత్రయపడుతోందట. ప్రస్తుతం కాజల్ నటిస్తున్న సినిమాల దర్శక నిర్మాతలకు గౌతమ్ విషయంలో కాజల్ పలు కండీషన్లు పెడుతున్నట్టుగా సమాచారం. అవి విని దర్శకనిర్మాతలు కూడా ఆశ్చర్య పోతున్నారట.
ఇటీవలే మొదటి యానివర్సరీ జరుపుకున్న కాజల్,గౌతమ్ వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయితే భర్త విషయంలో కాజల్ అన్నీ తానే ప్రవర్తిస్తున్నారట. అంతే కాకుండా గౌతమ్ వ్యాపార సంస్థల ఉత్పత్తులకు ప్రచారకర్తగా కాజల్ వ్యవహరిస్తున్నారు. అలాగే సినిమాలో కాజల్ తో పాటు తన భర్త గౌతమ్ కి కూడా ఏదో ఒక ప్రాధాన్యం ఉన్న పాత్రను ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట.
చిన్న పాత్ర అయినా కూడా పర్వాలేదు. కీలకంగా ఉంటే చాలు అన్నట్లు తెలుస్తోంది.గౌతమ్ కి కూడా ఒకసారి స్క్రీన్ పై కనిపించాలనే ఉందని భర్త కోరడంతో కాజల్ ఇదంతా చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే కాజల్ భర్త ఎంట్రీ ఇస్తే అతడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుందేమో చూడాలి మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…