Kajal Aggarwal : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది మన చందమామ కాజల్. గౌతమ్ కిచ్లు తో వివాహం తర్వాత కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ, వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకొన్న ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీ కి సంబంధించిన పోస్టులు చేస్తే సోషల్ మీడియాలో హడావిడి చేసేది. అయితే తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్, డెలివరీ తర్వాత కూడా తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకొని అందరినీ ఆకర్షించింది. కాజల్ తన కొడుకు పేరు నీల్ అంటూ అందరికీ పరిచయం చేసింది. అయితే తాజాగా కాజల్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది.
ఆచార్య సినిమాలో కాజల్ నటించక పోయినా రెమ్యునరేషన్ తీసుకుందా….
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఘన విజయం తర్వాత రామ్ చరణ్, దాదాపు మూడేళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న చిత్రం ఆచార్య కావడంతో ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, రామ్ చరణ్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించాల్సి వున్నింది. అయితే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్రకు లవ్ యాంగిల్ సెట్ అవ్వదు అని కొరటాల శివ భావించారట.
కాజల్ అగర్వాల్ ఈ సినిమా షూటింగ్ లో నాలుగు రోజులు కూడా పాల్గొంది. అయితే కొరటాల శివ తన ని ఒప్పించి ఈ సినిమా నుంచి తప్పించారు అట. ఇటీవలనే కొరటాల ఈ విషయం గురించి క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమా కాజల్ అగర్వాల్ ఒప్పుకున్నప్పుడు మొదటి షెడ్యూల్ షూటింగ్ అవ్వకముందే నిర్మాతలు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేశారట. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నటించడానికి కోటిన్నర రెమ్యునరేషన్ కి ఒప్పుకుందట. అయితే అనుకున్నట్టుగానే కోటిన్నర రెమ్యునరేషన్ నిర్మాతలు ముందే ముట్ట చెప్పినట్లు ఫిలింనగర్ లో వార్తలు నడుస్తున్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించి ఫిల్మ్మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…