కాకినాడ నుండి రావడం మూలంగా కాకినాడ శ్యామలగా బాగా పేరు తెచ్చుకున్న నటి శ్యామల గారు మొదట నాటకరంగంలో ప్రవేశించారు. చిన్నతనం నుండి సింగర్ కావాలని అనుకున్న శ్యామల అనూహ్యంగా నాటక రంగంలోకి వచ్చి చింతామణి, ప్రమీల వంటి నాటకాలతో మంచి గుర్తింవు తెచ్చుకుంది. ఇక అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శ్యామల మొదట బాలచందర్ గారి ‘మరో చరిత్ర’ సినిమాలో తల్లి పాత్ర పోషించారు. ఇక ఆ తరువాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి ఇలా సుమారు 200 కు పైగా సినిమాల్లో నటించిన ఆమె 90 లలో నటనకు గుడ్ బై చెప్పి వెండి తెర, బుల్లి తెర కు దూరంగా ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించిన శ్యామల గారు ఇండస్ట్రీ గురించి వివరించారు.
ఎన్టీఆర్, లక్ష్మి పార్వతికి పడిపోయాడు…
కాకినాడ శ్యామల ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అంటూ చెప్పారు. ఆయన నటించిన పాత్రలు ఇంకెవరూ చేయలేరు అంటూ చెప్పారు. అయితే సినిమాలలో ఎన్నో మహోన్నతమైన పాత్రలను వేసిన ఆయన లక్ష్మి పార్వతికి పడిపోయి జీవితంలో పెద్ధ తప్పు చేసారు. ఆడవాళ్ళ వీక్ నెస్ వల్లే లక్ష్మి పార్వతికి పడిపోయాడు.
ఒక రైటర్ గా ఆయన చరిత్ర రాస్తానంటూ వచ్చిన లక్ష్మి పార్వతి ఆయన మనిషి అయింది చివరకు అంటూ చెప్పారు. ఆవిడకు ఋణం ఉంది అయన భార్య అవ్వాలని అందుకే అయింది. కానీ ఆవిడను పెళ్లి చేసుకున్నాక ఆయన జీవితం మారిపోయింది. ఎంతటి వీరుడైనా ఆడదానికి పడిపోవాల్సిందే అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…