Categories: FeaturedMovie News

Suriya -Jyothika: ఆమె వల్లే సూర్య కుటుంబంలో విభేదాల… కుటుంబం నుంచి వేరుపడిన సూర్య!

Suriya -Jyothika: తమిళ చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటుడు సూర్య ఒకరు.ఈయన తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో కూడా విడుదల కావడంతో ఈయనకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి సూర్య హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించారు . ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే నటి జ్యోతిక సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విధంగా జ్యోతికను పెళ్లి చేసుకోవడం తన తండ్రి శివకుమార్ కి ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో గతంలో కాస్త విభేదాలు తలెత్తాయి. ఇక ఇష్టం లేకపోయినా జ్యోతిక శివకుమార్ తన కోడలిగా అంగీకరించారు.

ఇక వివాహం తర్వాత జ్యోతిక పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటి బాధ్యతలను చూసుకోవడమే కాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వచ్చారు..ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించినటువంటి జ్యోతిక ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె కొన్ని సినిమాలకు కూడా కమిట్ కావడంతో సూర్య కుటుంబంలో గొడవలు చోటుచేసుకున్నాయని తెలుస్తుంది.

Suriya -Jyothika: ముంబైకి మఖాం మార్చిన సూర్య…

జ్యోతిక తిరిగి ఇండస్ట్రీలో నటించడం ఇష్టం లేనటువంటి సూర్య తండ్రి ఈ విషయం గురించి తరచూ గొడవలు పడుతున్న నేపథ్యంలో సూర్య తన భార్య పిల్లలను తీసుకొని తన కుటుంబం నుంచి వేరుపడినట్లు తెలుస్తుంది.ఇక ఈయన తన భార్య పిల్లలతో కలిసి ముంబైలో నివసించడానికి ఇప్పటికే ఒక ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారని అయితే ఈ విషయం గురించి ఎక్కడ అధికారికంగా వెల్లడించలేదనే వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago