Manchu Manoj: మంచు మనోజ్ నేడు భూమ మౌనికతో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం మనకు తెలిసిందే.గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉంటూ తమ ప్రేమ విషయాన్ని ఎక్కడ బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. అయితే వినాయకుడి మండపంలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో వీరి రహస్య ప్రేమ ప్రయాణం బయటపడింది. అప్పటినుంచి తరచూ మీరు పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
ఇక మార్చి మూడవ తేదీ వీరిద్దరూ ఒకటి కాబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు అనుగుణంగానే ఇప్పటికే మనోజ్ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఘనంగా జరిగాయని అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మనోజ్ పెళ్లి అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మనోజ్ మౌనికల హల్ది, సంగీత్, మెహందీ వేడుకలు ఎంతో ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మౌనిక మనోజ్ హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే తన తమ్ముడి పెళ్లి కోసం చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలను కూడా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇకపోతే మనోజ్ మౌనికలు ఈరోజు (మార్చి 3)రాత్రి 8గంటల 30 నిమిషాలకు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని తెలుస్తుంది. ఇక వీరి పెళ్లికూడా మంచు లక్ష్మి ఇంట అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరగబోతుందని సమాచారం. ఇకపోతే మనోజ్ భూమా మౌనికతో రెండో పెళ్లికి సిద్ధం కావడం ఇష్టం లేనటువంటి మోహన్ బాబు విష్ణు ఈ పెళ్లికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అందుకే తన తమ్ముడి పెళ్లి బాధ్యతను లక్ష్మి తన భుజాలపై వేసుకుని అన్ని కార్యక్రమాలను దగ్గర నుండి చూసుకుంటున్నట్టు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…