Prabhas: కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటుడు ప్రభాస్. 2002వ సంవత్సరంలో ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన సినీ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.
ఇక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకి ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు. ఇలా తన పెదనాన్న కృష్ణంరాజు రెబల్ స్టార్ గా కొనసాగుతూ ఉండగా ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ అనే పేరుతో కొనసాగారు. ఇక సినిమా టైటిల్స్ ముందు కూడా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని వచ్చేది.
ఇక బాహుబలి సినిమా చేసిన తర్వాత ప్రభాస్ పేరు ముందు పాన్ ఇండియా స్టార్ అంటూ పేరు వచ్చేది కానీ ఇటీవల విడుదలైన కల్కి సినిమా టైటిల్స్ లో ప్రభాస్ పేరు మారిపోయింది. ఈయన పేరు ముందు రెబెల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ కాకుండా శ్రీ అని రావడంతో ప్రభాస్ పేరు మారింది అంటూ ఈ వార్తలను కూడా వైరల్ చేస్తున్నారు.
శ్రీ ప్రభాస్..
కల్కి సినిమా టైటిల్స్ లో ప్రభాస్ పేరుకు ముందు శ్రీ ప్రభాస్ అని పెట్టడంతో ప్రభాస్ తన పేరును కావాలనే మార్చుకున్నారా లేకపోతే ఎవరైనా మార్చారా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇకపై ప్రభాస్ ను మనం పిలవాలంటే రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ కాదండోయ్ శ్రీ ప్రభాస్ అని పిలవాల్సిందే. ఇలా ప్రభాస్ పేరు మారడంతో అభిమానులు కూడా ఇలా పేరు మార్చుకోవడం వెనక కారణాలు ఏంటని ఆరాతీస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…