Featured

Kalyan Ram : అభిమానులకు పండగ లాంటి వార్త… నేను, తారక్ ఒకే స్క్రీన్ మీద : కళ్యాణ్ రామ్

Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తాజాగా వస్తున్న సినిమా బింబిసార. ‘ఎంత మంచివాడవురా’ సినిమా తర్వాత చాలా విరామంతో ఈ సినిమా చేస్తున్నారు కళ్యాణ్ రామ్. హిట్లు ప్లాపులు సంబంధం లేకుండా ఒకవైపు కమర్షియల్ సినిమాలు తీస్తూనే మరోవైపు ప్రయోగాత్మక సినిమాలకు పెద్ద పీట వేస్తున్నారు కళ్యాణ్ రామ్. అంతే కాకుండా నిర్మాత గా కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు. క్రీస్థు పూర్వం 5 వ శాతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధినేత బింబిసారుని కథతో ఒక సోషియో ఫాంటసీ చిత్రంగా రాబోతున్న ‘బింబిసార’ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యానర్ పై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆగష్టు 5 న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేశారు. నిన్న విడుదల అయిన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ సినిమా విజుయల్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచుతోంది.

నన్ను, తమ్ముడు తారక్ ని ఒకే స్క్రీన్ మీద చూస్తారు…

ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడారు. మాట్లాడటం మాత్రమే కాదు అభిమానులకు పండగ లాంటి వార్త చెప్పారు. బింబిసార చిత్రానికి సంబంధించి సీక్వెల్ ఉంటుంది అని ఇంతకు ముందే చెప్పారు. అయితే ఈ సీక్వెల్ లో ఎన్టీఆర్ కూడా వుంటారా అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కళ్యాణ్ రామ్ ఇలా చెప్పారు… అన్నీ కుదిరితే నన్ను, నా తమ్ముడు తారక్ ని ఒకే స్క్రీన్ పై చూస్తారు. దాని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, అని అభిమానులను సర్ప్రైజే చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago