Kalyan Ram : కళ్యాణ్ రామ్ నుండి తాజాగా వస్తున్న సినిమా బింబిసార. ‘ఎంత మంచివాడవురా’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తో ఈ సినిమా చేస్తున్నారు కళ్యాణ్ రామ్. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తు, ప్రయోగాత్మక సినిమాలకు పెద్ద పీట వేస్తున్నారు కళ్యాణ్ రామ్. మరో వైపు నిర్మాత గా కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు.
క్రీస్థు పూర్వం 5 వ శాతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధినేత బింబిసారుని కథతో ఈ సినిమా రాబోతోంది. శ్రీ వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా కళ్యాణ్ రామ్ బావమరిది అయిన హరికృష్ణ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల పుణ్యభూమిలో ఓ అటవీక రాజు కథే ఈ సినిమా అంటూ విడుదల అయిన మోషన్ పోస్టర్ కి మంచి ఆదరణ లభించింది. ఇక ఈరోజు ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ విడుదల అయింది.
త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం….
ఈరోజు విడుదల అయిన ట్రైలర్ అదిరిందనే చెప్పాలి. ఓ సమూహం తాలుకు ధైర్యాన్ని ఒక ఖడ్గం శాసిస్తే, కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గనికి తలవంచి బానిసలైతే ఇందరి భయాన్ని చూసి పొగరుతో ఒక రాజ్యం మీసం మేలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం బింబిసారుడి ఏకచత్రాదిపథ్యం… అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే డైలాగు, దానికి తగ్గట్టు విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు వున్నాయట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…