Categories: FeaturedMovie News

Kalyan Ram : కళ్యాణ్ రామ్ భార్య స్వాతి ఏం చేస్తారో తెలుసా…!

Kalyan Ram : ఎన్టీఆర్ మనవడిగా తెలుగు సినిమాకు పరిచయమైన కళ్యాణ్ రామ్, బాబాయ్ బాలకృష్ణ సినిమా ‘బాల గోపాలుడు’ లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఇక మళ్ళీ చాలా ఏళ్ల తరువాత 2003లో ‘తొలి చూపులోనే’ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. ఆ సినిమా అంతగా రాకపోవడంతో సొంత బ్యానర్ పెట్టి నచ్చినట్టు కథలను చేస్తూ వస్తున్నాడు కళ్యాణ్ రామ్. అలా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘అతనోక్కడే’ సినిమాతో హిట్ కొట్టాడు. ఇక ఆ తరువాత 2006 లో పెళ్లి చేసుకున్న కళ్యాణ్ రామ్, పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకున్నాడు. పెద్దలు కుదుర్చిన వివాహమే అయినా పెళ్లిచూపుల్లోనే స్వాతి బాగా నచ్చడం తో తనను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాడట.

సినిమా రంగంలోకి స్వాతి…

మంచి కుటుంబం నుండి వచ్చిన స్వాతి, పెళ్ళికి ముందు డాక్టర్ గా పనిచేసారు. కానీ పెళ్లయ్యాక కుటుంబ భాద్యతల కోసం తన వైద్య వృత్తిని వదిలేసింది. కళ్యాణ్ రామ్, స్వాతి లకు ఇద్దరు పిల్లలు ఒక పాప, ఒక బాబు , తారక అద్వైత, శౌర్య రామ. ఇక పిల్లలు పెద్ద వాళ్ళు అవ్వడం వల్ల స్వాతి ఇపుడు మళ్ళీ ఏదైనా చేయాలని అనుకోని భర్త సహకారంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సొంత విఎఫ్ఎక్స్ సంస్థను స్థాపించారు. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన బింబసార చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

ఏ మాత్రం అంచనాలు లేకున్నా విడుదలయ్యాక మంచి టాక్ తో జనాలను థియేటర్లకు రప్పిస్తోంది. మొదటి సినిమాతోనే వశిష్ఠ మంచి సాలిడ్ హిట్ అందుకుని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత సినిమా చూడడానికి థియేటర్స్ కి అంతగా రాని జనం మళ్ళీ కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాకు రావడం సినిమా ఇండస్ట్రీ కి కూడా శుభపరిణామం. ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్న సమయంలో కళ్యాణ రామ్ బింబిసార ఆదుకుందనే చెప్పాలి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago