Movie News

Kalyan Ram Wife: ఆ యంగ్ హీరో సినిమా పై మనసు పారేసుకున్న కళ్యాణ్ రామ్ సతీమణి… ఏ సినిమా అంటే?

Kalyan Ram Wife: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి బ్యాగ్రౌండ్ ఉందో మనకు తెలిసిందే. ఇలా నందమూరి వారసులుగా కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో హీరో గాను నిర్మాతగాను కొనసాగుతున్నారు. ఈయన ఎన్నో సినిమాలను సొంత బ్యానర్ లోనే నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇకపోతే తాజాగా బింబిసారా సినిమా ద్వారా అద్భుతమైన హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కళ్యాణ్ రామ్ ఎంతో సింపుల్ గా ఉంటారు. ఈయన ఫ్యామిలీ విషయాలు పెద్దగా ఎవరికి చెప్పడానికి ఇష్టపడరు.అయితే కొద్ది రోజులుగా కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్ భార్య స్వాతి వృత్తిపరంగా డాక్టర్ అనే విషయం మనకు తెలిసిందే.

ఈమె మెడిసిన్ పూర్తి చేసి పెళ్లికి ముందు ప్రాక్టీస్ కూడా చేశారట అయితే పెళ్లి తర్వాత ఈమె తన వృత్తికి దూరమై పూర్తిగా కుటుంబ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇలా కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి స్వాతి టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శర్వానంద్ నటించిన శతమానం భవతి సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించారట.

Kalyan Ram Wife: కళ్యాణ్ రామ్ కు సినిమాల విషయంలో సలహా ఇచ్చిన స్వాతి..

ఈ విధంగా శతమానం భవతి సినిమా చూసిన తర్వాత ఈమె తన భర్త కళ్యాణ్ రామ్ కి ఓ సలహా ఇచ్చిందని తెలుస్తుంది.మీరు కూడా యాక్షన్ సినిమాలు కాకుండా ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమాలను చేయొచ్చు కదా? ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి అంటూ ఈమె తన భర్తకు సలహా ఇచ్చిందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఒక హీరో భార్య అయిండుకొని మరొక హీరో సినిమాలను ఇష్టపడుతూ తన భర్తకు సలహాలు ఇవ్వడం విశేషం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago