Movie News

Kamal Haasan: జయప్రదని ముద్దు పెట్టుకోమంటే కమల్ హాసన్ రియాక్షన్.. అందుకే అయన కళాతపస్వి అయ్యారు.!

Kamal Haasan: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఒక సాధారణ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఈ విధంగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన సుధాకర్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తన వ్యక్తిగత విషయాల గురించి సుధాకర్ మాట్లాడుతూ తనకు అవకాశాలు లేని సమయంలో కూడా తన భార్య శైలజ తనను ఎంతో అర్థం చేసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక సుధాకర్ కు డైరెక్టర్ విశ్వనాథ్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ విశ్వనాధ్ దర్శకత్వం గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. విశ్వనాథ్ గారి దర్శకత్వం అంటే హీరో ఎక్కడా కూడా ఒక చోట నిలకడగా ఉండి డైలాగ్ చెప్పలేరని, ఆయన దర్శకత్వం అంటే అలాగే ఉంటుందని తెలియజేశారు. మనం ఏదైనా డైలాగు చెప్పే సమయంలో కూడా ఏదైనా పుస్తకం తీసుకొని మాట్లాడటం లేదా పనిచేస్తూ డైలాగ్ చెప్పేలా అతను అప్పటికప్పుడు ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తారని సుధాకర్ వెల్లడించారు.

అందుకే ఆయన కళాతపస్వి..

ఈ సందర్భంగా సాగర సంగమంలోని ఒక సన్నివేశం గురించి సుధాకర్ మాట్లాడారు. సినిమాలోఒక నేషనల్ డాన్స్ కాంపిటీషన్ కి సంబంధించిన ఇన్విటేషన్ జయప్రద కమల్ హాసన్ కి ఇస్తారు. ఇన్విటేషన్ చూసిన కమల్ హాసన్ చివరిలో తనపేరు ఉండటం చూసి ఒక్క సారిగా ఎమోషనల్ అవుతారు. ఇలా ఎమోషనల్ అవుతున్న సమయంలో వెంటనే డైరెక్టర్ కమల్ హాసన్ జయప్రద చేతిని తీసుకొని ముద్దు పెట్టుకొని చెప్పారు. అతను అలా చెప్పడంతో కమల్ హాసన్ వెంటనే జయప్రద చేతిని తీసుకొని ముద్దు పెట్టారు. ఆ సీన్ కి ఆ ముద్దు పెట్టే సన్నివేశం హైలెట్ అయిందని ఈ సందర్భంగా సుధాకర్ వెల్లడించారు. విశ్వనాథ్ గారి సినిమాలు అంటే ఇలాగే ఉంటాయి అందుకే ఆయన కళాతపస్వి అయ్యారు అంటూ ఈ సందర్భంగా విశ్వనాధ్ గురించి వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago