Kamal R khan fires on KGF 2 : ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే కి ఒకరోజు ముందు కేజీఎఫ్ రెండవ భాగం విడుదలైంది. బాలీవుడ్ లో ఓపెనింగ్ కలెక్షన్స్ అందరిని ఆశ్చర్యపరిచాయి.అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా కేజీఎఫ్ రికార్డులు సృష్టించింది. ఇక సినిమాపై మొదటి రివ్యూ కూడా పాజిటివ్ గా రావడంతో సినిమా కలెక్షన్స్ మరింత ఊపందుకుంటున్నాయి. పూర్తి యాక్షన్ డ్రామా గా వచ్చినా సినిమాలో రాకీ భాయ్ స్టైలిష్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంది. మొదటి భాగంలో హీరో ఎలివేషన్ బాగున్నా హీరోను స్టైలిష్ గా దర్శకుడు చూపించలేదు. అయితే ఈ భాగంలో హీరోను స్టైలిష్ గాను హై ఎనర్జీ తో చూపించడంతో మరింత ఆకట్టుకుంది.
ప్రశాంత్ నీల్ ను కూడా జైలులో వేయాలట….
ఇక ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో ఆర్ఆర్ఆర్ చెత్త సినిమా అని తీసిన రాజమౌళిని జైలులో పెట్టాలని కామెంట్స్ చేసి వైరల్ అయిన బాలీవుడ్ క్రిటిక్ గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ తాజాగా కేజీఎఫ్ పై కూడా సరిగ్గా అలాంటి కామెంట్స్ చేసి మరోసారి సోషల్. మీడియాలో వైరల్ అవుతున్నాడు.కేజీఎఫ్2 సినిమా బాగోలేదని, మొదటి 30 నిముషాలు అసలు ఏమి జరుగుతుందో అర్థంకాదని ఆర్ఆర్ఆర్ కంటే కేజీఎఫ్ 10 రెట్లు చెత్త సినిమా అంటూ.. ఇక సినిమా బాగుందని చెప్పిన ప్రేక్షకులకు జాలి చూపించాలంటూ కామెంట్స్ చేసాడు.ఇక ఆర్ఆర్ఆర్ రివ్యూ అప్పుడు రాజమౌళిని జైలులో పెట్టాలి అని అన్న కమల్ ఖాన్ ఇపుడు ప్రశాంత్ ను కూడా జీవితాంతం జైలులో పెట్టాలని, ప్రేక్షకులను ఇలా ఫూల్స్ ను చేసినందుకు అంటూ రెచ్చిపోయాడు. ఇక ఇలాంటి బుర్రలేని దర్శకులను ప్రోత్సహించరాదంటూ ఘాటుగా మాట్లాడాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…