టాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలలో అగ్రతారగా ఉన్న వెటరన్ సీనియర్ నటి నగ్మా తాజాగా బాలీవుడ్ క్వీన్ కంగనాపై సంచలన కామెంట్స్ చేశారు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ లో నెపోటిజం గురించి రోజుకో చర్చ, సాగుతున్న సంగతి తెలిసిందే. కొందరు బాలీవుడ్ సినీ తారలు ఈ అంశంపై ఘాటుగానే స్పందిస్తున్నారు.
సినీరంగంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నగ్మా తాజాగా ‘కంగనా దీదీ కెరీర్ మొత్తం నెపోటిజం అనే పిల్లర్ మీదే ఆధారపడి ఉంది. ఎవరి సపోర్ట్ లేకుండానే బాలీవుడ్‌లో ఆమె ఈ స్థాయికి చేరుకుందా.? కంగనాను బాలీవుడ్‌కి పరిచయం చేసిన ఆదిత్యా పంచోలి, ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రంలో కంగనాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన మహేశ్ భట్ కూడా నెపోటిజం తోనే ఛాన్స్ ఇచ్చారా.? కంగనా కెరీర్ డౌన్ అయిన సందర్భాలలో హృతిక్ రోషన్ రీ- లాంచ్ చేయడం కూడా నెపోటిజమేనా.?’ అని ప్రశ్నిస్తూ కొన్ని మీమ్స్ ను కూడా ట్విట్టర్‌లో షేర్ చేసింది.
వెంటనే కంగనా రనౌత్ డిజిటల్ టీమ్ నగ్మా కామెంట్స్ కు ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. ‘‘నగ్మాజీ ఆదిత్యా పంచోలి కంగనాకు బాయ్ ఫ్రెండ్ కాదు. కంగనా కెరీర్ ప్రారంభంలో అతను కంగనాకు సహాయపడిన మాట వాస్తవమే.. కానీ., ఆ తర్వాత తనను హింసించే వ్యక్తిగా ఆదిత్యా మారాడని కంగనా చాలా సందర్భాల్లో మీడియాకి తెలియజేసింది. ఆడిషన్స్ టైంలో కూడా పంచోలి కంగనాను కొట్టి హింసించాడన్న సంగతిని మీరు గుర్తించాలి. కేవలం డబ్బు కోసం పెళ్లి వేడుకలలో డాన్స్ చేసే అలవాటు కంగనాకు లేదు. అందుకే బాలీవుడ్‌లో ఏ ఏజెన్సీ కూడా ఆమెను సంప్రదించలేదు. ఆ టైంలో ఆమె సోదరి రంగోలి తనకు మేనేజర్‌గా పని చేసింది. ‘కైట్’ సినిమాలో కంగనా పాత్ర తగ్గడంతో బాధపడిన తర్వాత ‘క్రిష్ 3’ చిత్రం చేయడానికి మొదట అంగీకరించలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సినిమా చేయాల్సి వచ్చింది. ఇక ‘గ్యాంగ్ స్టర్’ చిత్రం షూటింగ్ టైంలో నెపోటిజం ఉండకపోవచ్చు. ఇప్పుడైతే అన్ని రంగాల్లోనూ నెపోటిజం ఉంది. సీనియర్ నటిగా, రాజకీయ నాయకురాలిగా సొసైటీలో పేరున్న మీరు కూడా ఇలా అసంబంధమైన అంశాలను ప్రచారం చేయడం చాలా బాధాకరం’’ అని నగ్మాకు కౌంటర్‌గా వరుస ట్వీట్లు చేసింది కంగనా డిజిటల్ టీమ్.
మరోవైపు నటి నగ్మా బాలీవుడ్ క్వీన్ కంగనాపై సెటైర్లు వేయడంతో నెటిజన్లు కూడా భగ్గుమంటున్నారు. గతంలో నగ్మా కొనసాగించిన ఎఫైర్ల చిట్టాను కామెంట్స్ రూపంలో షేర్ చేయడం మొదలు పెట్టారు. అండర్ వరల్డ్ డాన్లతో సంబంధాలున్నాయని, సౌరవ్ గంగూలీ, రవికిషన్, శరత్ కుమార్ వంటి వారితో అక్రమ సంబంధాలు నడిపిందని, నగ్మా నటన పేరుతో కొనసాగించిన ప్రేమ భాగోతాలన్నీ అందరికీ తెలుసనీ ఓ రేంజ్ లో మండిపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…